మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతనిస్తున్న గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు,వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాల్లో జాప్యం నివారించి, ఇంకా ప్రారంభం కాని ప్రాధాన్యత భవనాల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఉన్నతాధికారులకు వివరించారు. శనివారం విజయవాడలోని తన కార్యాలయం నుండి ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణ బాబు, గ్రామీణాభివృద్ది శాఖ కమీషనర్ కోన శశిధర్ లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామస్థాయిలో చేపట్టిన ప్రయారిటీ భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బేస్మెంట్ స్థాయిలో ఉన్న నిర్మాణాలను రూఫ్ స్థాయికి తీసుకరావడంతో పాటు పూర్తయిన భవనాలను సంబంధిత శాఖలకు స్వాధీనం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. ప్రాధాన్యత భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రాధాన్యత భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన ఇంజనీర్లు భవన నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. బిల్లులు పెండింగ్ లో ఉంటే తక్షణమే అప్ లోడ్ చేయాలన్నారు. నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా మాట్లాడుతూ, తమ జిల్లాలో గ్రామ సచివాలయ భవనాలు 387 మంజూరు కాగా అందులో 144 భవనాల నిర్మాణం పూర్తి కాబడిందని మిగిలిన 243 గ్రామ సచివాలయ భవనాలు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. అలాగే, కృష్ణాజిల్లాలో మొత్తం రైతు భరోసా కేంద్రాలు 380 కాగా నిర్మాణం పూర్తికాబడినవి 72 ఉన్నాయని మిగిలిన 308 ఆర్ బి కె లు నిర్మాణాలు జరుగుతున్నట్లు చెప్పారు. అలాగే వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలు మొత్తం 283 మంజూరు కాగా ఇప్పటివరకు పూర్తి కాబడినవి 46 ఉన్నాయన్నారు. జిల్లాలో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ 19 మంజూరు కాగా , చల్లపల్లి మండలం మాజేరు గ్రామంలో ఏర్పాటుచేసిన పాల శీతలీకరణ కేంద్రం పూర్తికాబడిందనన్నారు. అలాగే డిజిటల్ లైబ్రరీ లు జిల్లాలో 30 మంజూరు కాగా అవనిగడ్డ, కోడూరు,నాగాయలంక ప్రాంతాలలో నిర్మాణం మొదలు కాగా బాపులపాడు మండలంలో పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి కాబడినట్లు, అయితే, ఫైబర్ నెట్ సిగ్నెల్ లభ్యమయ్యే చోట లక్ష్యాలు నిర్ధేశించారన్నారు. భవన నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ ఆ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి కాబడేటట్లు చర్యలు తీసుకొంటున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి వివరించారు.
Prajavartha Online Telugu News