Breaking News

పీఎస్‌ఎల్‌వీ-సి53 ప్రయోగం విజయవంతం పట్ల గవర్నర్ హర్షం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సి53 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లటం పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతరిక్ష ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. రాకెట్‌ సన్నద్ధత, లాంచ్‌ ఆథరైజేషన్‌ సమావేశాల అనంతరం, ముందుగా నిర్దేశించిన సమయంలో అంతరిక్ష వ్యర్థాలు అడ్డు వస్తున్నాయని గుర్తించి రెండు నిమిషాలు ఆలస్యంగా రాకెట్‌ ప్రయోగించారు.  ఇది న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌ఐఎల్‌) వాణిజ్య పరమైన రెండో మిషన్‌ కాగా, సింగపూర్‌, కొరియాకు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుందని గవర్నర్ అన్నారు.   పీఎస్‌ఎల్‌వీ-సి53 నూతన సాంకేతికత ఆలంబనగా ఉప్రగహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తదుపరి, నాలుగో దశలో మిగిలిన రాకెట్‌ను కక్ష్య వేదికగా ఉపయోగించి అక్కడే శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించేందుకు అవకాశం ఉండటం గర్వ కారణమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *