Breaking News

నిరుపేదలకు అండగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్న నిరుపేదలకు విద్య, ఉపాధి కల్పన కొరకు విజయవాడ నగరంలో చేపడుతున్నట్టు ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ అన్నారు. గత ఐదు సంవత్సరాలు నుండి ట్రస్టు తరఫున అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ ‌ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.బుధవారం తూర్పు నియోజకవర్గలోని 13వ డివిజన్లో తోటవారి వీధి లో దేవినేని రాజశేఖర్ నెహ్రు ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబానికి చెందిన కొత్త రూపవతి కి జీవనోపాధి నిమిత్తం 16 వేల రూపాయలు విలువ చేసే తోపుడు బండి అవినాష్ అందజేశారు.అదేవిధంగా నిరుపేద మహిళ అయిన పద్మ కి భర్త మరణించగా అతని పెన్షన్ ఆగిపోయినది. ఆమె వితంతు పెన్షన్ కు పెట్టుకోగా మంజూరు అవడానికి 2నెలలు సమయం పడుతుంది అని స్థానిక నాయకులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అవినాష్ దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించిన ఆయన వెంటనే 2 నెలల పెన్షన్ అమౌంట్ ను దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసారు.ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని నిరుపేదలకు అండగా నిలవాలనే ఆయన ఆశయాలకు అనుగుణంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నాం అని అన్నారు. భవిష్యత్తు లో ఇలాగే అవసరమైన నిరుపేద కుటంబాలకు దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాం అన్నారు. .ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జి మాజి కార్పొరేటర్ రామాయణపు శ్రీనివాస్, వైసీపీ నాయుకులు ఉకోటి రమేష్, శ్రీను, కోలా ఉమా, పిడుగు విజయ్, అబ్దుల్ హనాన్, పల్లి రమేష్, పల్లి ప్రకాష్, గుండు సతీష్, చాణిక్య బాబురావు, ధనుష్, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *