-రాష్ట్ర హోమ్ మంత్రి డా. తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతీ పేదవారికి చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి డా. తానేటి వనిత అన్నారు. బుధవారం కొవ్వూరు మండలం నందమూరు గ్రామం లో గడపగడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో హోం మంత్రి పాల్గొన్నారు. ఈ సంద ర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి గడపకు సుమారు రెండు లక్షల రూపాయలు తక్కువ కాకుండా మన ప్రభుత్వంలో సంక్షేమ పథకాల రూపంలో అందిస్తున్నామని మంత్రి అన్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని మంత్రి వివరించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి ఎవరికైనా అందడం లేదా అన్న దానిపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రధాన సమస్యలను కూడా మంత్రి దృష్టికి ప్రజలు తీ సుకొచ్చారు. గ్రామ శివారు ప్రాంతంలో రక్షిత మంచినీటి సరఫరా జరగడం లేదని మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కొత్తగా మంజూరైన పింఛన్లను హోం మంత్రి తానేటి వనిత లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ. యం. సి. ఛైర్మెన్, వి.శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ పోసిన శ్రీలేఖ, మున్సిప ల్ చైర్ పర్సన్ భావన రత్నకు మారి,పిడి డ్వామా,యం. పి. డి . ఓ పి. జగదాంబ, బండి పట్టాభి రా మారావు, తాళ్ళపూ డి యం. పి. పి. జొన్నకూటి పో సిరాజు,మండల తాహిసీల్దార్ బి. నాగరాజు నాయక్, సుంకర సత్యనారాయణ,తదితర నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News