-ప్రజల్లో అవగాహన కోసం డి మార్ట్ లో ప్రత్యేక నమోదు కార్యక్రమం
-కమిషనర్ దినేష్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ, రూరల్ ప్రాంతాల్లో ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధాన కార్యక్రమం లో భాగంగా ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు చర్యలు తీసుకుంటు న్నట్లు మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఓటరు నమోదు అధికారి 50 రాజమండ్రి సిటీ మరియు కమీషనర్ నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్ మండలం లోని క్వారీ మార్కెట్ ఏరియా నందు గల డి మార్ట్ నందు శుక్రవారం ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడమైనదని దినేష్ కుమార్ తెలియచేశారు. నిత్యం ఎక్కువ మంది వినియోగదారులు డి మార్ట్ కు నగరం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొనుగోలు కోసం రావడం జరుగుతుందని వారినే లక్ష్యంగా పైలెట్ ప్రాజెక్టుగా ఈ ప్రాంతాన్ని గుర్తించి, ఇక్కడ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. రెండు షిఫ్ట్ లలో నగర పాలక సంస్థ సిబ్బంది ని నియమించి, ప్రజల నుంచి ఓటర్ ఐడి, ఆధార్ కార్డు వివరాలు సేకరించడం జరుగుతుందని దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఒక నెల రోజుల పాటు ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని అన్నారు.
Prajavartha Online Telugu News