ఇడుపులపాయ, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 13 వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. సీఎం వైఎస్ జగన్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు.. వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.
Prajavartha Online Telugu News