ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
జిల్లా స్త్రీ, శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారిణి, వారి ఆధ్వర్యములో ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు అంగన్వాడి కేంద్రములలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు కాగా 6వ తేదీన జిల్లా స్థాయి అధికారిణి అయిన జి.ఉమా దేవి కార్యక్రమమును ఉద్దేశించి హాజరైనటువంటి గర్భిణి స్త్రీలు మరియు బాలింతలు అంగన్వాడి కార్యకర్తలకు తల్లిపాల పై అవగాహన కల్పిస్తూ తల్లిపాలు బిడ్డకు మొదటి టీకా అని, తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, తల్లి పాలు బిడ్డకు ఇవ్వడం వలన పిల్లలలో వచ్చేటువంటి డయేరియా, నిమోనియా, ఊబకాయం వంటి వ్యాధులను అరికట్టవచ్చు అని, తల్లి పాలు ఇవ్వటం వలన శిశు అమరణాలు తాగించవచ్చు అని, పిల్లలకు పాలు ఇవ్వటం వలన రొమ్ము కాన్సర్ మరియు మధుమేహం వంటి వ్యాధుల్ని తగించవచ్చని, 6నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని 7వ నెల నుండి 2సంllరాల వరకు బిడ్డకు యితర ఆహార పదార్థములతో పాటు తల్లి పాలు కొనసాగించాలని తెలియజేసినారు. అనంతరం ఓల్డ్ జి.జి.హెచ్ ఎన్.ఆర్.సి లో డైటీషీయన్ అయినటువంటి మేఘనా కార్యక్రమమును ఉద్దేశించి తల్లిపాలు బిడ్డకు పట్టడం మన బిడ్డలు అనారోగ్యానికి తక్కువగా గురవ్వుతారు అని తల్లులకు పాలు ఎక్కువగా ఉత్పత్తి అవటం కొరకు తల్లులు తీసుకోవలసిన ఆహార పదార్థములు చిలకడదుంప, పచ్చిబొప్పాయి, జీలకర్ర, మెంతులు మరియు ఆకు కూరలు ఎక్కువగా తినాలని తెలిపారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలను, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను NRCలో జాయిన్ చేయాలని తెలియజేసారు. వెల్ బేబీ షో నిర్వహించి విజేతలైన పిల్లలకు బహుమతులు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమములో విజయవాడ 1 మరియు 2 సి.డి.పి.ఓలు టి.నాగమణి, జి.మంగమ్మ మరియు సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు మరియు గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *