-జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణాల పనుల ప్రగతిపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు.
గృహ నిర్మాణాల పనులు వేగంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని, రెవిన్యూ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు వాలంటీర్లతో సమన్వయం చేసుకొని నిర్మాణ పనుల్లో పురోగతిని చూపాలన్నారు.
ప్రారంభంకాని ఇళ్లను ప్రారంభింపచేయాలని లబ్ది దారులను చైతన్య వంతులను చేయాలని బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న వాటిని బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలని ఆదేశించారు. లేఅవుట్ లలో నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సిమెంట్, ఇసుక , ఐరన్ సిద్ధంగా ఉన్నప్పటికీ పనులు అసంతృప్తిగా ఉన్నాయన్నారు. పనుల పురోగతిలో ఎటువంటి క్షేత్రస్థాయి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షించాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవిని కలెక్టర్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News