“వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం అమలులో సమగ్ర విధానంలో సర్వే చేపట్టి పూర్తి చెయ్య వలసి ఉంటుందని జిల్లా పంచాయతీ అధికారి పి. జగదాంబ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో “వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం” పై
సమాన ప్రక్రియ పద్ధతి పై సర్వేయర్స్, సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులు, వి ఆర్ వో ల తో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిపివో పీ.జగదంబ మాట్లాడుతూ, జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో సమగ్ర విధానంలో “స్వమిత్వ” (విలేజ్ అబాడి సర్వే మరియు విలేజ్ స్రీస్‌లో మెరుగైన సాంకేతికతతో మ్యాపింగ్) విధానంలో సర్వే చేపట్ట వలసి ఉందన్నారు. ఇందుకు మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు వారి వారి స్థాయి లో సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు. మీ మీ గ్రామాల్లో ఖాళీగా ఉన్న భూములను గుర్తించడం స్థానిక సిబ్బంది సహకారం అవసరం అన్నారు. భూములను గుర్తించడం, ఆ భూములకు చెందిన యజమానులు ద్వారా సరిహద్దులు గుర్తించి, సర్వే రాళ్ళు ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే వివిధ రకాల ఫార్మాట్ లను ఇవ్వడం జరిగిందని, వాటిని ఇప్పటికే క్షేత్ర స్థాయి సిబ్బంది పూర్తి చేసి, సమగ్ర డేటా పంపడం జరిగిందని జగదాంబ అన్నారు. తొలుత చిన్న గ్రామాల్లో సర్వే సమగ్ర సమాచారం సేకరణ, తదితర పనులు పూర్తి చేస్తే, తదుపరి దశలో పెద్ద గ్రామాలపై దృష్టి పట్టి ఎక్కువ మంది సిబ్బందిని పంపి సర్వే పనులు పూర్తి చెయ్యడం సాధ్యం అవుతుందని, ఆ దిశలో అడుగులు వేయాల్సి ఉంటుందన్నారు. సర్వే మరియు సరిహద్దుల చట్టం 1923 లోని నియమ నిబంధనలు అనుసరించి భూ యజమానులు వారి భూమి వద్దకు వొచ్చి సరిహద్దులు చూపించి తగిన సమాచార, సహాయ సహకారాలు అందించి సహకరించే క్రమంలో ఆస్తి యజమానులకు నోటీస్ జారీ చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో సర్వే ఎ. డి., పి. లక్ష్మణ రావు, ఇంచార్జి డీల్. పి. ఓ, జి. షతీష్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే యర్, కె. వి. రామ కృష్ణ, డిప్యూటీ ఎస్. ఓ, గాలిబ్ సాహెబ్, సెక్రటరీలు , సర్వేయర్లు , వి ఆర్ వో లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *