Breaking News

పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు అజరామరం అని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలో జరిగిన ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన కృషిని స్మరించుకున్నారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకోసం జీవితాంతం కృషిచేసిన మహనీయులు అని కీర్తించారు. పట్టుదల, కార్యదీక్ష, నిబద్దతకు ఆయన నిలువెత్తు రూపంగా నిలిచారన్నారు. ఆ మహనీయుడని త్యాగానికి గుర్తుగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నెల్లూరు జిల్లాకు అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసి ఆయన గౌరవాన్ని మరింత ఇనుమడింపజేశారన్నారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలన పొట్టి శ్రీరాములు సేవలను గుర్తుచేసుకునే అవకాశం లేకుండా చేసిందని.. తెలుగు ప్రజల ఆకాంక్షలను నాడు చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. సంప్రదాయంగా వస్తున్న మన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు. తెలంగాణ ఏర్పడిన జూన్‌ 2ను ఏపీ చరిత్రలో చీకటిరోజుగా అభివర్ణిస్తూ నవనిర్మాణ దీక్షల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవం, పొట్టి శ్రీరాములు జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని చెప్పుకొచ్చారు. తెలుగువారందరినీ ఒక్క తాటిపైకి తెచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, నాయకులు కొల్లూరు రామకృష్ణ, మైలవరపు రామకృష్ణ, గోపాలకృష్ణ, తుకారం బాబు, కోలవెన్ను కొండ, చల్లా సుధాకర్, దోనేపూడి శ్రీనివాస్, ఉప్పు రంగబాబు, కమ్మిలి రత్న, నాళం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *