Breaking News

అను మై బేబీలో అత్యంత అరుదైన చికిత్స

– అకుంఠిత దీక్షతో పసికందు ప్రాణాలను నిలబెట్టిన అను వైద్యులు
– గర్భస్రావం కాకుండా తల్లికి రక్షణ
– చిన్నపేగులో లోపంతో పుట్టిన బిడ్డ ప్రాణ సంరక్షణ
– నవజాత శిశువుకు విజయవంతంగా మూడు శస్త్రచికిత్సలు
– దేశ వైద్య చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టం
– క్రౌడ్ ఫండింగ్ తో కోలుకున్న పసికందు
– అను మై బేబీ వైద్యులకు ప్రశంసల వెల్లువ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ప్రజల మన్ననలందుకున్న అను మై బేబీ వైద్యులు, అత్యంత అరుదైన చికిత్సను విజయవంతంగా పూర్తిచేసి మరోసారి చరిత్ర సృష్టించారు. అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో వుండే పాశ్చాత్య దేశాల్లో సైతం కేవలం 20 శాతం మాత్రమే సక్సెస్ రేటుండే సంక్లిష్టమైన చికిత్సా ప్రక్రియను అకుంఠిత దీక్షతో పూర్తిచేశారు. చిన్నపేగు సక్రమంగా లేకుండా పుట్టినబిడ్డను కంటికి రెప్పలా కాపాడి పసి ప్రాణాన్ని నిలబెట్టిన అను మై బేబీ వైద్యులకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మన దేశ వైద్య చరిత్రలోనే అరుదైన ఘట్టంగా పేర్కొనదగిన ఈ చికిత్స వివరాలను అను మై బేబీ వైద్యులు మీడియాకు వివరించారు. ఎనికేపాడులోని అను మై బేబీ హాస్పిటల్లో మంగళవారం జరిగిన సమావేశంలో ప్రముఖ నియోనెటాలజిస్ట్ డాక్టర్ గురుప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఏలూరుకు చెందిన హారిక భవానికి గతంలో వరుసగా రెండుసార్లు గర్భస్రావం కాగా, మూడోసారి గర్భం దాల్చగా పుట్టిన రెండోరోజునే బిడ్డ చనిపోయింది. ఆ తర్వాత కూడా హారికకు మరోసారి గర్భస్రావం జరిగింది. సంతానభాగ్యం కోసం ప్రయత్నించి నాలుగుసార్లు విఫలమైన హారిక భవాని మరోమారు గర్భం దాల్చగా, గర్భస్థ శిశువుకు చిన్నపేగు సక్రమంగా ఏర్పడకపోవడంతో అబార్షన్ తప్పదని పలువురు వైద్యులు సూచించారు. అయితే, తాము సంతానవంతులు కావడానికి ఇదే ఆఖరి అవకాశంగా భావించిన హారిక భవాని, ఫణికుమార్ దంపతులు అను మై బేబీ వైద్యులను సంప్రదించారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పావని మాణిక్య నేతృత్వంలో హారిక ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ, గర్భస్థ శిశువుకు అవసరమైన చికిత్సలను కొనసాగించారు. 34వ వారంలో సిజేరియన్ ద్వారా హారిక మగబిడ్డకు జన్మనివ్వగా, వైద్యులకు అసలైన సవాలు అప్పుడే ఎదురైంది. చిన్నపేగు సక్రమంగా ఏర్పడకుండా పుట్టిన బిడ్డ ప్రాణాలను నిలబెట్టేందుకు అను మై బేబీ వైద్యులు రోజుల తరబడి నిరంతరం శ్రమించారు. చిన్నపేగు లోపంతో పుట్టడంతో, పాలు తాగి జీర్ణించుకోలేని బిడ్డకు అవసరమైన పోషకాలను రక్తనాళాల ద్వారా అందిస్తూ సంరక్షించారు. చిన్నపేగు లోపాన్ని సరిచేసి బిడ్డను బతికించాలనే లక్ష్యంతో మూడు పర్యాయాలు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను నిర్వహించారు. అను మై బేబీ వైద్య నిపుణుల కృషి ఫలించి 40 రోజుల సుదీర్ఘ చికిత్స అనంతరం బిడ్డ సాధారణ స్థితికి చేరి తల్లిపాలు తీసుకోగలుగుతోంది’ అని వివరించారు. తల్లి ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ, సురక్షితంగా సిజేరియన్ చేసిన డాక్టర్ పావని మాణిక్య, అర్ధరాత్రి సమయంలో సైతం అత్యవసర శస్త్రచికిత్స చేసిన ప్రముఖ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్, నిరంతరం పనిచేసే అను మై బేబీ వైద్య సిబ్బంది సహకారంతో ఈ అతి క్లిష్టమైన, అత్యంత అరుదైన చికిత్సను విజయవంతంగా పూర్తిచేయగలిగామని చెప్పారు. ఈ చారిత్రాత్మక చికిత్సను విజయవంతంగా పూర్తిచేసి, పసిబిడ్డ ప్రాణాలను నిలబెట్టేందుకు సహకరించిన దాతలకు డాక్టర్ గురుప్రసాద్ కృతఙ్ఞతలు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా అందిన సహాయంతో పాటు, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సైతం ఆర్ధిక చేయూతను అందించిందని ఆయన వెల్లడించారు. అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ.. మన దేశ వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టంగా నిలిచిపోయే విజయాన్ని సాధించిన అను మై బేబీ వైద్య నిపుణులు అభినందనీయులని అన్నారు. అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలు, అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అంకితభావంతో పనిచేసే వైద్య సిబ్బంది సమిష్టి కృషితో ప్రసూతి, నవజాత శిశు వైద్య సేవలు, చిన్నపిల్లల వైద్య సేవల్లో అగ్రగామిగా అను మై బేబీ నిలుస్తోందని డాక్టర్ రమేష్ తెలియజేశారు. ఈ సమావేశంలో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ డాక్టర్ జి. శ్రీదేవి, డాక్టర్ కె.వి. రవికుమార్, డాక్టర్ పావని మాణిక్య, డాక్టర్ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

HNSS పనులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా…2027లోగా పూర్తి చేయాలని ఆదేశం

-2027 నాటికి HNSS శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులుపై కేబినెట్‌లో మంత్రి మండిపల్లిని అడిగిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *