Breaking News

ఐ క్రియేషన్‌ ఈవెంట్‌ వారి ఐకానిక్‌ మోడల్‌ గోడపత్రిక ఆవిష్కరణ…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని రిలయన్స్‌ జ్యూయలర్స్‌లో ఐ క్రియేషన్‌ ఈవెంట్‌ వారు ఐకానిక్‌ మోడల్‌ గోడపత్రికను, కిడ్స్‌ ర్యాంప్‌వాక్‌ను నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఇమాన్యుయల్‌ మాట్లాడుతూ పిల్లలోని సృజనాత్మకను వెలికి తీయడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందించిన రిలయన్స్‌ జ్యూయలర్స్‌, ఎస్‌.ఎం.ఈవెంట్‌, ఎంఆర్‌టి కన్సల్టెంటెన్సీ, డ్రీమ్స్‌ క్రియేషన్స్‌, గురు ఫొటోగ్ర్రఫీ, ఎస్‌జి కిడ్స్‌ స్కూల్‌ అందరినీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పిల్లలను తర్ఫీదుకు ప్రోత్సహాన్ని ఇచ్చి వారితోపాటు వచ్చిన తల్లిదండ్రులను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రిలయన్స్‌ జ్యూయలర్స్‌ మునీరా, మార్గం ఫౌండేషన్‌ అన్నపూర్ణ, క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌, డెంటిస్ట్‌ హేమలత, కిరణ్‌జోట్‌ తదితరులు హాజరయ్యారన్నారు. ఇప్పటి దాకా నమోదుచేసుకున్న పిల్లలు, పెద్దలకు జనవరి 29వ తేదీన ఫైనల్‌ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ రోజు జరిగిన ఆడిషన్స్‌కు భారీ సంఖ్యలో విద్యార్దులు, పిల్లలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *