Breaking News

ఘనంగా బొమ్మసాని సుబ్బారావు పుట్టిన రోజు వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టీడీపీ విజయవాడ పార్లమెంటు ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు పుట్టిన రోజు వేడుకలు గొల్లపూడిలోని తమ కార్యాలయంలో, కొండపల్లి, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కాలనీ తదితర ప్రాంతాలలో ఘనంగా ఆయన అభిమానులు నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన వేడుకలలో బొమ్మసాని సుబ్బారావు మాట్లాడుతూ తనపై ఇంత ఆదరాభిమానులు చూపుతున్న నియోజకవర్గ ప్రజలు, అభిమానులకు, కార్యకర్తలకు, టీడీపీ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చి వారి సేవచేసి రుణం తీర్చుకుంటానన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవకి, ప్రజా సమస్యలపై పోరాడతానన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు, అభిమానులతో కలిసి తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రజలలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక ఆలోచనలు వున్నాయని ఈ సందర్భంగా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రజలలో మమేకం అవుతానన్నారు. డిసెంబర్‌ 1వ తేదీ నుండి ‘రాష్ట్రానికి ఇదేం కర్మరా బాబు’ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక ఆలోచనలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఇప్పటికే ప్రజలలో వచ్చిన మార్పుకు అధికార పార్టీకి కనువిప్పు కలగాలన్నారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వుంటానన్నారు. అనంతరం భారీ కేక్‌ కట్‌చేసి పంపిణీ చేశారు. అన్ని మతాల వారు వచ్చి ఆయనను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ అబ్దుల్‌ ఖాదర్‌, కాజా రాజ్‌కుమార్‌, భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, నగర ప్రముఖులు హాజరై అభినందనలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *