Breaking News

23951 మంది రైతుల ఖాతాలకు రూ.5.20 కోట్లు జమ : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రబీ 2020-21 , ఖరీఫ్ 2021 సున్నా వడ్డీ, ఖరీఫ్ 2022 పంట నష్టపరిహారం జిల్లాలో 23951 మంది రైతులకు రూ.5.20 కోట్లు నేడు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం గౌ.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ, పంట రుణాల వడ్డీ రాయితీని అర్హతగల రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్లను రైతులకు జమ చేసే కార్యక్రమాన్ని చేపట్టగా జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి అద్యక్షులు రఘునాథ రెడ్డి, రైతులు, వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు వీక్షించారు. గౌ.ముఖ్యమంత్రి రైతుల ఖాతాలకు కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సన్న, చిన్నకారు రైతులు రూ.లక్ష వరకు పంట రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీ రాయితీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2019 నుండి అమలు చేసి రైతులను ఆదుకుంటున్నదని , అలాగే ప్రకృతి వైపరిత్యాలలో పంట నష్టపోయిన రైతులకు పరిహారంగా ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నదని అందులో భాగంగా నేడు 23951 మంది రైతుల ఖాతాలకు రూ.5.20 కోట్లు జమ చేశామని అన్నారు. జిల్లాలో రబీ 2020-21 , ఖరీఫ్ 2021 కి సంబందించిన సున్నా వడ్డీ 23,601 మంది రైతులకు రూ.5.01 కోటి , ఇన్పుట్ సబ్సిడీ క్రింద మరో 350 మంది రైతులకు రూ. 19.05 లక్షలు జమ చేశామని అన్నారు. అనంతరం మెగా చెక్కును రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న వారి స్పందనలు:
వ్యవసాయ సలహామండలి అద్యక్షులు రఘునాథ రెడ్డి:

ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులను ఆదుకుంటున్నారని, రైతులున్న గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి తేవడం, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందించిన, ఉచిత పంటల భీమాతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించడం, సున్నా వడ్డీతో రైతులకు రుణాలు అందించడం, కష్టమర్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుతో వ్యవసాయ యంత్రాలు రైతులకు అందుబాటులో ఉంచడం వంటివి దేశంలోనే ఏ రాష్ట్రం చేపట్టని విధంగా రైతుల సంక్షేమo అమలు చేస్తున్నారని, ధన్యవాదాలని అన్నారు.

రైతు శ్రీ ప్రహ్లాద, తిరుపతి రూరల్ మండలం:
నాకు ఉన్న పొలం ఎకరా 40 సెంట్లు లో చెరుకు పంట సాగు కోసం బ్యాంక్ నుండి 60 వేల రూపాయల రుణం తీసుకొని సకాలంలో చెల్లించడం జరిగింది. 2020-21 సంవత్సరానికి వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు నా ఖాతాలో జమ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకము రైతులందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్రభుత్వము రైతులకు ప్రోత్సాహంగా ఇలాంటి పథకాన్ని తీసుకురావడం వలన రైతులను వారి పంటలను బాగా పండించుకొని ఆర్థికంగా లబ్ధి పొందుతాము. రైతుల సంక్షేమం కోసం ఆలోచించి సున్నా వడ్డీ పంట రుణాలు పథకాన్ని తీసుకువచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

రైతు నారాయణస్వామి, కరకంబాడి పంచాయతీ, రేణిగుంట మండలం:
తరతరాల నుంచి మా కుటుంబం వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నాము. నేను 3 ఎకరాల 50 సెంట్లు లో రోజాపూలు, మల్లెపూలు తోట సాగు చేస్తున్నాను. ఈ పంట సాగు కోసం 90 వేల రూపాయలు రుణం తీసుకున్నాను. ఇప్పుడు 2020-21 సంవత్సరానికి సకాలంలో తిరిగి చెల్లించినందుకు గాను వైయస్సార్ సున్నా వడ్డి పంట రుణాలను లబ్ధి పొందడం ఆనందంగా ఉంది.రైతు లేనిది రాష్ట్రం లేదని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు మేలు కలిగే పథకాలు అమలు చేయడం సంతోషం, రైతులందరూ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము.

రైతు రమేష్ , చంద్రగిరి మండలం, డోర్ణ కంబాల గ్రామం :
నేను పంట సాగు కోసం బ్యాంక్ నుంచి 60 వేల రూపాయలు తీసుకొన్నాను. 2020-21 వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణం కింద లబ్ధి పొందడం సంతోషంగా ఉంది. గతంలో మాకు ఎలాంటి పంట రుణాలు మంజూరు కాలేదు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగవలసి వచ్చేది. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకు వచ్చిన వైయస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు పథకం దేవుడు ఇచ్చిన వరం లాంటిది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *