Breaking News

వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి ఆలోచనతో కీలక మార్పులు

-ఉద్యాన పంటలలో ఏడాది కొక్క వెరైటీ పరిశోదన అభినందనీయం : కాకాని గోవర్ధన్ రెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గౌ.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రైతులకు ఏ చిన్న సమస్య వచ్చినా ఆదుకోవాలని తరచూ రైతుల సంక్షేమం కోసం పాటు పడే వ్యక్తి అని రాష్ట్ర వ్యవసాయ , మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మాత్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం డా.వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ డా. టి.జానకిరాం ఆద్వర్యంలో స్థానిక చీని, నిమ్మ పరిశోదన స్థానం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు ఇక్కడ 2021-22 స్వర్నోత్సవాల ముగింపు కార్యక్రమం లో రాష్ట్ర వ్యవసాయ , మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మాత్యులు ముఖ్య అతిధిగా పాల్గొని ఉద్యాన పంటలలో పరిశోదనలు, మెలుకువలు వంటి పలు పుస్తకావిష్కరణలు, సావనీర్ విడుదల చేశారు. మంత్రి మాట్లాడుతూ ఉద్యాన విశ్వ విద్యాలయ ఆద్వర్యంలో చీని, నిమ్మ పరిశోదనా స్థానంలో రైతులకు కష్ట నష్టాలలో అండగా నిలవాలని ఏడాది కొక్క పంటను ఎంపిక చేసి, దిగుబడి పెంచి పరిశోధనలు చేపట్టడం శాస్త్రజ్ఞునులను అభినందిస్తున్నానని అన్నారు. 2020-21 కొబ్బరి, 2021-22 చీని, నిమ్మ పరిశోధనలలో ముందడుగు వేసి 2022-23 ఆర్ధిక సంవత్సరాన్ని అరిటి సంవత్సరంగా ఎంపిక చేసుకోవడం అభినందనీయమని అన్నారు. వాతావరణం, వ్యాధులను తట్టుకునే విధంగా, నాణ్యమైన పండ్ల దిగుబడులకు పరిశోధనలు చేసి అభివృద్ధి చేయడం శాస్త్రవేత్తల నిరంతర కృషికి ధన్యవాదాలని అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలతో వ్యవసాయ వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకొని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉద్యాన సహాయకులను నియమించారని, ఇప్పటి వరకు ఉద్యాన సర్టిఫికేట్ పొందిన విద్యార్థులు కాళీగా లేరని, కోర్సు చేసిన ప్రతి వ్యక్తికీ ఉద్యోగం అందుతున్నదని ఇంకనూ సచివాలయాలలో పోస్టులు కాళీగా ఉన్నాయని అన్నారు. కోవిడ్ సమయంలో సి- విటమిన్ ప్రాదాన్యత తెలిసి వచ్చిందని చీని, నిమ్మ అభివృద్దిలో గత 50 సంవత్సరాలుగా పని చేసిన వ్యక్తులకు ధన్యవాదాలని అన్నారు. దేశంలో సాలీన 10.50 లక్షల హెక్టార్లలో 14 మిలియన్ టన్నుల చీని,నిమ్మ దిగుబడి ఉంటె మన రాష్ట్రంలో ఒక లక్ష 40 వేల హెక్టార్లలో 30 లక్షల టన్నుల దిగుబడి తో దేశంలో ప్రదమ స్థానం లో నిలచిందని అన్నారు. ఉద్యాన విశ్వ విద్యాలయ సావనీర్, రైతుల విజయ గాధలు, స్వీట్ ఆరంజ్, పులుసు నిమ్మ , సాంకేతిక పరిజ్ఞానం మరియు పరిశోధనలు, ఉద్యాన పంటల రైతుల ప్రశ్నలు, సమాధానాల పుస్తక ఆవిష్కరనలతో పాటు కొత్త వెరైటీ పోస్టర్, చీనీ, నిమ్మ పాటల సి.డి లను ఆవిష్కరించారు. ఉద్యాన పంటలలో ప్రతిభ కనబరచిన రైతులను, పరిశోధనలో పాలు పంచుకొన్న శాస్త్రవేత్తలను, ప్రోఫెసర్లను ఘనంగా సన్మానించారు. అన౦తరం ఆవరణలో మంత్రి మొక్కలను నాటారు. మంత్రి మొదటగా ఉద్యాన పంటల సమాచార కేంద్రాన్ని ప్రారంభించి, డా.వై.ఎస్.ఆర్ హార్టికల్చర్ యునివర్సిటీ స్క్రీన్ హౌస్ సందర్శించి బత్తాయిలో వైరస్ తెగుళ్ళు సోకని సయాను కొమ్మల ఉత్పత్తిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఉద్యాన పంటల ఉత్పత్తి, మందుల వాడకం, పంటల ఉపయోగం, వివిధ రకాలతో తయారైన వంటల ప్రదర్శనలను, ప్రకృతి వ్యవసాయ ప్రదర్శనల స్టాల్స్ ను పరిశీలించారు.
కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామి రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద రావు, పి.డి.ఏ.పి.ఎం.ఐ.పి సతీష్ , ఉద్యాన శాస్త్రవేత్తలు మధుమతి , న్మాగరాజు, నారం నాయుడు, ముకుంద లక్ష్మి, చినీ నిమ్మ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, రూరల్ ఎం.పి.టి.సి రత్నమ్మ, ప్రకృతి వ్యవసాయ౦ ఏ.పి.ఎం మునిరత్నం, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *