Breaking News

వ్యవసాయ భూములు , శ్మశాన వాటికల కేటాయింపులపై వీడియో కాన్ఫరెన్స్…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం సిఎం అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరావు ఎస్సీ లకు వ్యవసాయ భూములు , శ్మశాన వాటికల కేటాయింపులపై అమరావతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టరేట్ విసి సమావేశ మందిరం నుంచి రెవెన్యూ అధికారులతో కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె . మాధవీలత వివరాలు తెలుపుతూ, జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ల నుంచి వ్యవసాయ భూముల కోసం వొచ్చిన దరఖాస్తులపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ వ్యవసాయ భూమి వివరాలతో నివేదిక అందజేయ్యాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎస్సీల కోసం శ్మశాన వాటిక లకోసం వొచ్చిన అభ్యర్థనలను పరిగణన లోకి తీసుకుని అనువైన ప్రాంతం, భూములను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఆర్డివో లు ఎస్. మల్లి బాబు, ఏ. చైత్ర వర్షిణి, లాండ్ పర్యవేక్షకులు కె. శ్రీనివాస రావు లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *