Breaking News

అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల సహకారంతో కృషి చేస్తున్నాను…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాను అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకువెళుతున్నామని ఇందుకు ప్రతీ ఒక్కరి సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. ఢిల్లీ రావు అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మీడియా ప్రతినిధులతో అయన కార్యాలయంలో ఇష్టాగోష్టి నిర్వహించారు. మీడియా ప్రతినిధులతో అయన మాట్లాడుతూ జిల్లాల పునః వ్యవస్తీకరణ నేపథ్యంలో ఏర్పడిన ఎన్ టి ఆర్ జిల్లాను అభివృద్ధి పధంలో నిలిపేందుకు అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల సహకారంతో తనవంతు కృషి చేస్తున్నానన్నారు. ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాలను సాదించగలిగామన్నారు. ఇందులో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు అందించిన సలహాలు, సూచనలు తనకెంతగానో ప్రేరణ కల్పించామన్నారు. ఇదే స్పూర్తితో రానున్న నూతన సంవత్సరం మరింత అభివృద్ధి పధంలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామన్నారు. గత ఏడాది అభివృద్ధి సంక్షేమ పధకాలను అర్హులైన ప్రతీ లబ్ధిదారునికీ చేరువు చేశామన్నారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక స్పందన ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. గ్రీవెన్స్ పై అర్జీదారుల అభిప్రాయాలను తెలుసుకుని వారి సంతృప్తిని తెలుసుకుంటున్నానన్నారు. 22ఏ కేసులకు సంబంధించి ప్రతీ శనివారం ప్రత్యేక డ్రైవ్ మేళా నిర్వహించి అర్జీదారులు, అధికారుల సమక్షంలో పరిష్కరిస్తున్నామని ఇప్పటికే 22 కు పైగా కేసులను పరిష్కరించామన్నారు. క్రొత్త ఏర్పడిన డివిజన్లపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా అర్జీలను స్థానికంగానే పరిష్కరించేలా రెవిన్యూ అధికారులకు తెలిపామన్నారు. జిల్లాలో ప్రత్యేకంగా మహిళాభివృద్ది, శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టమని దీనిలో భాగంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులలో రక్తహీనతను నివారించి ఆరోగ్యకర సమాజాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రానిక్ వేస్ట్, వ్యర్ధ పదార్దాల సక్రమ నిర్వహణ, రీ సైక్లింగ్ వంటి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. లేఅవుట్ లలో మెరక చేయడం, మౌలిక వసతులు వంటి సౌకర్యాలు కల్పించడంతో కొంత ఆలస్యం అయినప్పటికీ నిర్దేశించిన గడువు లోగా జాతీయ రహదారుల విస్తరణపై దృష్టి పెట్టామని చిన్న అవుటపల్లి నుండి బై పాస్ వరకూ విస్తరణ పనులు పూర్తి చేశామన్నారు. కొంత విస్తరణకు సంబంధించి 12 మంది రైతులవద్దనుండి భూసేకరణ చేయవలసి ఉందన్నారు. దసరా ఉత్సవాలు, భవానీ దీక్షలా విరమణను విజయవంతంగా నిర్వహించడం ఆత్మ సంతృప్తిని నిలిపిందన్నారు.
ఏ కొండూరు కిడ్నీ వ్యాధులకు సంబంధించి సానుకూల దృక్పధంతో ముందుకు వెళుతున్నామన్నారు. వ్యాధి తీవ్రత నిర్దారించే క్రియాటిన్ స్థాయి 5 కన్నా ఎక్కువగా 120 మందికి పైగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వ్యాధికి ప్రధానంగా నీటిలో మెటల్ సిలికా, క్లోరైడ్ కారణం కావచ్చునని నిపుణులు సూచించారన్నారు. శుద్ధి చేసిన నీటిని టాంకర్ ల ద్వారా సరఫరా చేస్తున్నామని ఆనీటిని త్రాగునీటి అవసరాలతో పాటు వంటకు వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించామని కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు.
ఇష్టాగోష్టి కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా ఉప కార్యనిర్వహక సమాచార ఇంజినీర్ యు. సురేంద్రనాధ్, జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి ఎస్. వి. మోహన్ రావు, సమాచార శాఖ ప్రచార సహాయకులు వేమూరి వర ప్రసాద్ లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *