రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఆదివారం ఓటర్ ఐడి ని స్పెషల్ ఆధార్ అనుసంధానం చేయడం కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న 1559 పోలింగ్ కేంద్రాల ద్వారా 9,800 మంది డేటా, గరుడా యాప్ ద్వారా 4,234 మంది డేటా అనుసంధానం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఉన్న 15,52,268 మంది ఓటర్ల లో 10,89,114 మంది ఆధార్ వివరాలుతో అనుసంధానం చేశామన్నారు. క్షేత్ర స్థాయి లో ఉన్న 1559 పోలింగ్ కేంద్రాలలో ఆధార్ అనుసంధానం ప్రక్రియను 540 కేంద్రాలను ఓటు నమోదు అధికారులు తనిఖీలు నిర్వహించారని మాధవీలత తెలిపారు. ఆదివారం ఒక్క రోజే 14,034 మంది ఓటర్ సంఖ్య ఆధార్ అనుసంధానం చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్క ఓటరు స్వచ్ఛందంగా వారి ఓటర్ ఐడి ని ఆధార్ తో బి ఎల్ వో ను సంప్రదించాలని సూచించారు.
Prajavartha Online Telugu News