-జిల్లాలో 23 కేంద్రాల్లో 7946 మంది అభ్యర్ధులు ధరఖాస్తు
-ఉదయం 5,407 (68. 05%) మంది, మధ్యాహ్నం 5,378 (67.68 %)మంది హాజరు
-కలెక్టర్ కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో ఈరోజు గ్రూపు-1 ప్రిలిమినరి పరీక్షలను అత్యంత ప్రశాంతంగా, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా నిర్వహించినట్లు జిల్లా కలెక్టరు కె. మాధవీలత పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూపు-1 ప్రిలిమినరి పరీక్షల తీరును కలెక్టర్ రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల లోను, జిల్లా రెవెన్యూ అధికారి జీ నరసింహులు స్థానిక ఆదిత్య డిగ్రీ మహిళలు కళాశాల లోనూ ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 23 పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు 7946 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారాన్నారు. సుమారు 70 శాతం మంది హాజరయ్యారన్నారు. ఉదయం 10.00 గంటల నుంచి పేపరు-1, మ. 2.00 నుంచి పేపరు-2 పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి లైజనింగ్ అధికారిని, స్వాడ్ లను నియమించామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు అత్యంత ప్రశాంతంగా పరీక్షల నిర్వహణ చేపట్టినట్ల కలెక్టర్ తెలియచేశారు. ఉదయం జరిగిన పరీక్షకు 5,407 (68. 05%) మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 5,378 (67.68 %)మంది అభ్యర్ధులు హాజరు అయ్యారన్నారు.
పరీక్షల అనంతరం ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు, ఇతర పరీక్షా సామాగ్రి పత్రాలను పూర్తి బంధోబస్తుతో సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం కి చేరుస్తామని, తదుపరి ఏ.పి.పి. ఎస్.సి. అధికారులు ప్రత్యేక భద్రత తో విజయవాడ తరలించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబందించి సర్వీస్ కమీషన్ సూచించిన మార్గదర్శకాలను లైజన్ అధికారులు, ఛీఫ్ సూపరింటెండెంట్లు ఒకటికి రెండు సార్లు పూర్తి పరిశీలన చేయాలన్నారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపింగ్ కు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు ఆమె తెలిపారు.
జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు ఆదివారం ఉదయం స్థానిక ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షల నిర్వహణను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కేంద్రంలో పరీక్షలు రాయవలసిన 300 మందికి గాను ఉదయం 194 మంది (64.67%); మధ్యాహ్నం 193 (64.33%); మంది హజరైనట్లు డిఆర్వో జీ. నరసింహులు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News