విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం కేశినేని శివనాథ్ చిన్ని సౌజన్యంతో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు 30వ డివిజన్ రామకృష్ణాపురం నందు ఘనంగా జరిగాయి. ఈ ముగ్గుల పోటీల లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బొండా ఉమామహేశ్వరరావు వారి చేతుల మీదుగా బహుమతులు అందజేసి ముందుగా ప్రజలు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ; ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, పప్పు, ఉప్పు,అన్ని ఆకాశాన్ని అంటుతున్నాయి అని, తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.500 రూపాయలు వచ్చే కరెంటు చార్జీలు ఈరోజున రూ. 1500 వరకు వస్తుందని కూలి పనులు చేసుకునే వారు ఎలా కడతారని ప్రశ్నించారు. అలాగే కరెంటు చార్జీలు, ఇంటి పన్ను, నీటి పన్ను,చెత్త మీద పన్నేసినటువంటి ఈ ప్రభుత్వం కాలువల నుంచి దుర్వాసన వస్తుంది అని చెప్పిన పట్టించుకోకుండా వదిలేస్తున్నారు,చిన్నపిల్లలని పెట్టుకుని ఆ దూర్వాసనల మధ్య రోగాలు వస్తున్న స్థానిక వైసిపి MLA పట్టించుకున్న దాఖలాలు లేవు అని… అలాగే పసి పిల్లలు తాగే పాల మీద లీటరుకు రూ. 10 రూపాయలు పెంచారని, అలాగే గ్యాస్ బండ 1130 రూపాయలు చేసి ప్రతి మహిళ మీద భారాన్ని మోపారని అన్నారు, 70 రూపాయలు వుండే కందిపప్పు రూ. 100 దాటిపోయిందని… ఒకటో తారీకు వస్తుందంటేనే ఆడవారు వణికిపోతున్నారని ఇంటి అద్దెలు ఎలా కట్టుకోవాలని, చంద్రబాబు నాయుడు నిరుపేద ఇల్లు లేని వాళ్లకుకట్టి ఇచ్చిన ఇళ్లు గృహప్రవేశాలకి రెడీ కి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇప్పుడు భూజు పట్టి పోతున్నాయి అని, ఈ వైసిపి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని… ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, సంక్రాంతి పండుగ అంటేనే మనకి గుర్తుకు వచ్చేది హరిదాసులు, గొబ్బెమ్మలు సంక్రాంతి ముగ్గులు, భోగి మంటలు అని ప్రతి తెలుగువాడు చేసుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇల్లు సంతోషాలతో అష్టఐశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని.. మరలా రామరాజ్యం రావాలి అంటే సైకోపాలన పోవాలి-సైకిల్ పాలన రావాలి అని కోరుకుంటున్నారు అని,రాష్ట్రం అభివృద్ధి కావాలి అంటే చంద్రన్న రాజ్యం రావాలి అని దివిస్తున్నారు అని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు,AMC మాజీ డైరెక్టర్ గంటా కృష్ణ మోహన్,గరిమెళ్ళ చిన్న,చౌదరి సూర్యనారాయణ, శ్రీనివాసరాజు, శేషంరాజు,కోటేశ్వరమ్మ ,వెలగపూడి శ్రీను,లక్ష్మీ ,శారద, నాగమణి,పోలేరమ్మ ,అనురాధ, రఫీ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News