విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు నగర పరిశుభ్రతలో భాగంగా పరిసరాల పరిశుభ్రతతో పాటు మురుగు కాల్వల నిర్వహణ కూడా సక్రమంగా జరగాలని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్), కే. సత్యవతి మలేరియా-6 పరిధిలోని గాంధీనగర్ మరియు సత్యనారాయణపురం ఏరియాలో పర్యటించి మురుగు కాలువల నిర్వహణ గురించి సూచనలు చేయడమైనది ముఖ్యంగా కొత్తగా ఇళ్ల నిర్మాణాలు జరిగే ఏరియాలలో వ్యర్ధాలు గాని, నిర్మాణాలకు ఉపయోగించే ఇసుక మరియు కంకర అడ్డుపడి మురుగునీటి కాలువల నిర్వహణకు అడ్డంకిగా మారి దోమల వ్యాప్తికి ముఖ్య కారణంగా మారుతున్నాయని కనుక అటువంటి సందర్భాల్లో ఇంటి యజమానులకు తద్వారా జరిగే పరిణామాలను వివరించి ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ఆటంకం లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బయాలజిస్ట్ హెచ్ సి హెచ్. సూర్య కుమార్, మలేరియా ఇన్స్పెక్టర్ మరియు శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News