-డ్రెయిన్స్ నందు మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చూడాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బుధువారం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి సర్కిల్-1 పరిధిలో గల 44 మరియు 51 వ డివిజన్ల నందు నాలుగు స్తంభాల సెంటర్ మరియు వాగు సెంటర్, నెహ్రు బొమ్మ సెంటర్ పలు వీధులు మరియు కొండ ప్రాంతాలలో తెల్లవారుజామున పర్యటించి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు స్థానికంగా ఉన్న సమస్యలను పర్యవేక్షంచి అధికారులకు పలు సూచనలు చేసినారు. కొండ ప్రాంతములో పర్యటిస్తూ కొండ ప్రాంత వాసులకు రోడ్లు, డ్రెయిన్లు, మెట్లు, త్రాగునీటి సరఫరా మొదలగునవి సక్రమముగా అందుబాటులో ఉన్నవీ లేనివి అడిగితెలుసుకొని డివిజన్ లో పారిశుధ్య నిర్వహణ విధానము మెరుగుపరచాలని, ఖాళీ స్థలములలో గల చెత్త మరియు వ్యర్ధములను తొలగించి స్థానికులు ఎవరు చెత్త మరియు వ్యర్ధములు పడవేయకుండా చూడాలని సూచించినారు. డివిజన్ నందలి పరిసరాలయు పరిశుభ్రంగా తీర్చిదిద్దుటతో పాటుగా మెట్ల మార్గంలో గల వాటర్ పైపు లైన్ లను కాంక్రీట్ తో మూసివేయునట్లుగా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించినారు. అదే విధముగా కమీషనర్ మరియు 51 వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్ కొత్తపేట లోని కె.టి రోడ్ నందు పూర్తి కాబడిన సి.సి. రోడ్ పరిశీలించి నెహ్రు బొమ్మ సెంటర్ నుండి చిట్టినగర్ జంక్షన్ వరకు మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబందిత అధికారులను ఆదేశించినారు. తదుపరి తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జనవరి 25 న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తూన్న కార్యకమమునకు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు, మరియు ఇతర ఐ.ఏ.ఎస్ ఆఫీసర్స్ విచ్చేయుచ్చున్న సందర్భంగా అక్కడ ఏర్పాట్ల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇస్తూ, ఆయా పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించినారు. అదే విధముగా కళాక్షేత్రం ప్రాంగణములో ఆహ్లాదకరమైన వాతావరణము కనిపించేలా ఏర్పాటు చేసిన మొక్కలను పరిశీలించి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేసించినారు. ప్రధాన మరియు అంతర్గత రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణా విధానమును మరియు సైడ్ డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల విధానమును పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. పర్యటనలో 51 వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్, జోనల్ కమిషనర్ -1 కె.టి. సుధాకర్, హెల్త్ ఆఫీసర్లు డా.సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ మూర్తి మరియు శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు ఇతర అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News