విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్ పుప్పల నరసకుమారి, మరియు అధికారులతో కలసి సర్కిల్-3 పరిధిలో గల 15 మరియు 21 వ డివిజన్లలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు స్థానికంగా ఉన్న సమస్యలను పర్యవేక్షంచి అధికారులకు పలు సూచనలు చేసినారు.
ముందుగా 15 వ డివిజన్ లో స్క్రూ బ్రిడ్జి క్రింద నివాసం ఉంటున్న ప్రాంతమును పరిశీలించి అక్కడ టాయిలెట్స్ లేకపోవడం గమనించి వారి కోసం తాత్కాలికంగా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించినారు. అదేవిధంగా వంగవీటి మోహన రంగా పార్కును పరిశీలించి డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ కమిషనర్ కి ప్రతిభావించగా పార్కు లోపల ఉన్నటువంటి షెడ్డును చూసి దానిని గ్రంధాలయంగా మార్చమని చెప్పగా కమిషనర్ సానుకూలంగా సంధించినారు. పార్కులోపల గ్రీనరిని అభివృద్ధి చేయాలని ఉద్యాన వన అధికారులకు ఆదేశించినారు.
తదుపరి 21 వ డివిజన్ లో గల పద్మావతి ఘాట్ నందు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను త్వరగా పూర్తి చేయాలని, అక్కడ పార్కును, గ్రీనరీని మరియు పిల్లలు ఆడుకోవడాని ఆట పరికరాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించినారు.
తదుపరి కృష్ణలంక శివశంకరపురం లోని బర్మా సీతారామయ్య నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రాధమిక స్కూల్ ను పరిశీలించి పిల్లల యొక్క శాతం చాలా తక్కువ ఉండండం గమనించగా కార్పొరేటర్ పుప్పల నరసకుమారి , కమిషనర్ కి ప్రతిభావించగా ఇక్కడ ఉన్నంటువంటి పిల్లను వేరే స్కూల్ కి మార్చి ఈ యొక్క బిల్డింగును అభివృద్ధి పనులకు ఉపయోగించాలని కార్పొరేటర్ కమిషనర్ ని కోరడమైనది.
ఈ పర్యటనలో డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్ పుప్పల నరసకుమారి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మరియు శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు ఇతర అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News