Breaking News

ప్రజా సమస్యలపై స్పందనలో వచ్చున అర్జీలు సత్వరమే పరిష్కరించాలి

-స్పందనలలో 13 అర్జీలను స్వీకరించిన.
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందనలో మేయర్  రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించి ప్రజలు తెలిపిన సమస్యలపై అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. నగరపాలక సంస్థ ద్వారా కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ప్రజలు తెలిపిన సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
నేటి స్పందన కార్యక్రమములో పట్టణ ప్రణాళిక – 6, ఇంజనీరింగ్ – 2, పబ్లిక్ హెల్త్ విభాగం – 1, రెవిన్యూ– 4, అర్జీలు వచ్చినవి.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్)  యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్)  కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, మేనేజర్ బి.శ్రీనివాస్ రావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యువతలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహనకు 5కే రెడ్ రన్

-హెచ్‌ఐవీ/ఎస్టీఐ రహిత తరం కోసం యువత భాగస్వామ్యం కావాలి -కమిషనర్ రాహుల్ మీనా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *