-ఆధార్ కార్డు నవీకరణ (అప్‌డేట్)కు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు..
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పౌరుల ఆధార్ కార్డుల నవీకరణ (అప్‌డేట్) పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటిని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు ద్వారా ఎప్పటికప్పుడు ఆధార్‌ను అప్‌డేట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ పై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటి సమావేశం సోమవారం కలెక్టరేట్ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో కమిటి అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల జీవన సౌలభ్యాన్ని సులభతరం చేసేందుకు శక్తివంతమైన ఆయుధం ఆధార్ కార్డు అన్నారు. పౌరులు వారి ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు నవీకరణ చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. ఆధార్ కార్డుల నవీకరణ పర్యవేక్షణకు ప్రభుత్వం జిల్లా స్థాయి కమిటిని నియమించడం జరిగిందన్నారు. కమిటిలో నగర పోలీస్ కమీషనర్, లీడ్‌బ్యాంకు మేనేజర్, జిల్లా రెవెన్యూ అధికారి, సిఇవో, జిల్లా పంచాయతీ అధికారి, మహిళా శిశు సంక్షేమ అధికారి, జిల్లా వైద్య అధికారి, డ్వామా పీిడి, డిఆర్‌డిఏ పీిడి, ఇతర జిల్లా స్థాయి అధికార్లను సభ్యులుగా నియమించడం జరిగిందన్నారు. పర్యవేక్షణ కమిటి ఆధార్ అప్‌డేట్ పై ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై ప్రక్రియను పర్యవేక్షించాల్సిన అవసరం వుందన్నారు.2010`2016 సంవత్సరాల మధ్య ఆధార్ కార్డు పొందిన వారు డాక్యుమెంటెషన్‌ను సమర్పించి ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోవాలన్నారు. 5 నుండి 7 , 15 నుండి 17 సంవత్సరాల వయస్సులోపు వారు ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చునన్నారు. గత కృష్ణా జిల్లాలో ఆధార్ కార్డు పొంది ప్రస్తుతం ఎన్‌టిఆర్ జిల్లా పౌరులు జిల్లా పేరును అప్‌డేట్ చేసుకోవాలన్నారు. ఆధార్ కార్డు ద్వారా పౌరులు దాదాపు వెయ్యి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ది పొందుతున్నారన్నారు. బ్యాంకు ఖాతాలను ప్రారంభించడం, మొబైల్ సిమ్ పొందడం, విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు పొందేందుకు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు, ఐటి రిటర్న్‌లు సులభంగా ఇవెరిఫై చేసుకునేందుకు, దేశంలో ఒక రేషన్ కార్డు ద్వారా ఎక్కడ నుండి అయిన రేషన్ పొందేందుకు ఆధార్ కార్డు ఎంతో దోహదపడుతుందన్నారు. ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకునేందుకు పోస్టాఫీసు, బ్యాంకులు, సచివాలయాలు, విద్య, వైద్య ఆరోగ్య శాఖలలో ప్రత్యేక ఆధార్ కేంద్రాల ద్వారా ఆధార్ అప్‌డేట్ చేసుకునే సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఆధార్ కేంద్రాల పై ప్రజలలో అవగాన కల్పించి ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకోవాలన్నారు.ఆధార్ అప్‌డేట్‌కు సంబంధించి ఇతర వివరాలకు 1947 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి సమాచారం పొందవచ్చున జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
ఆధార్ పర్యవేక్షణ కమిటి సమావేశంలో గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి కె. అనురాధ, ఐసిడిఎస్ పిడి జి. ఉమాదేవి, డిపివో జె. సునీత, డిఇవో సివి రేణుక, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాస్, లీడ్‌బ్యాంకు మేనేజర్ కోటేశ్వరరావు, డియంహెచ్ వో డా. యం సుహాసిని, ఆధార్ రిజనల్ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News