ప్రణాళికాబద్దంగా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రక్రియ చేపట్టాలి: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని స్విమ్స్, స్వికార్, ఎస్.వి. ఆయుర్వేదిక్ ఆసుపత్రుల సమన్వయంతో ప్రణాళికాబద్దంగా క్యాన్సర్ స్క్రీనింగ్ (గుర్తింపు) ప్రక్రియ చేపట్టాలని, ప్రథమ దశలోనే క్యాన్సర్ గుర్తింపు జరగాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో త్వరలో జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రక్రియ నిర్వహించడానికి స్విమ్స్, స్వికార్, ఆయుర్వేదిక్ ఆసుపత్రుల డాక్టర్లతో, జిల్లా కలెక్టర్ ప్రణాళిక తయారు ప్రక్రియపై సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనాబాలో 10 శాతం మంది క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని సర్వేలు తెలుపుతున్నాయని అన్నారు. మన జిల్లాలో 2021 లో 10 వేల మందికి పరీక్షలు చేస్తే 44 కేసులు 2022 లో 13 వేల మందికి పరీక్షలు చేస్తే 65 కేసులు నమోదు అయ్యాయని ఇందులో మహిళలలు 67 శాతంగా ఉందని దీన్ని బట్టి చూస్తె మహిళలలు అధికంగా 45 వయస్సు పైబడ్డ వారు క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ నివారణ, వైద్య చికిత్సలకు ప్రత్యేక ప్రాధాన్యతలు ఇవ్వాలని నిర్ణయించిందని ఆ మేరకు మనం జిల్లాలో చేపట్టవలసిన ప్రక్రియపై ప్రభుత్వానికి నివేదించాలని అన్నారు. జిల్లాలో 691 సచివాలయాల పరిధిలో వైద్య సిబ్బంది 2000 పైగా ఉన్నారని వారికి శిక్షణ ఇచ్చి క్యాన్సర్ గుర్తింపుపై వీరి సేవలు ఉపయోగించుకోవాలని అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కొత్తగా స్విమ్స్ లో కేర్ ట్రాకర్ యాప్ ప్రారంభించుకున్నామని ఇది చికిత్స సమయంలో ఉపయోగపడుతుందని ఇందుకోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారాని అన్నారు. అలాగే పెయిన్ అండ్ పాలివేటివ్ ఆంకాలజీ వింగ్ లో లైఫ్ సపోర్ట్ కోసం ఎస్.వి.ఆయుర్వేదిక్ ఆసుపత్రి సమన్వయం కావాలని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో స్విమ్స్, టాటా ఆసుపత్రులకు పింక్ బస్ లు ఉన్నాయని మరో రెండు బస్సులు ప్రభుత్వాన్ని కోరనున్నామని ఒకొక్క బస్సులో 120 మందికి స్క్రీనింగ్ చేసే అవకాశం ఉన్నందున జిల్లాలో పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ నిర్వహించి కేసులను గుర్తించి చికిత్సలు అందించడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. వీటితో పాటు డి.బి.ఆర్ ఆసుపత్రి ఆరోగ్యశ్రీలో ఆంకాలజీ ఉందని వీరి సేవలు కూడా ఉపయోగించుకోవాలని సూచించారు.

ఈ సమీక్షలో డి.ఎం.అండ్ హెచ్.ఓ శ్రీహరి, స్విమ్స్ డా.నాగేశ్వర రావు, డా.చంద్రశేఖర్, ఎస్.వి.ఆయుర్వేదిక్ ఆసుపత్రి రేణుదీక్షిత్, ప్రినిసిపల్ మురళీకృష్ణ, డా.విజయభాస్కర్, స్వికార్ పి.వి.హేమంత్, డా.హర్షవర్ధన్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *