Breaking News

ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023 -24 వార్షిక బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై ముస్లిం ఐక్యవేదిక నిరసన వ్యక్తం చేసింది. గాంధీ నగర్ లోని ధర్నా చౌక్ లో మంగళవారం జరిగిన ధర్నా కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక నాయకులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ జాఫర్ అలీ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ముస్లిం మైనారిటీ వర్గాలపై వివక్షత చూపుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023- 24 వార్షిక బడ్జెట్లో మైనార్టీ వర్గాల నిధులు కేటాయింపులలో భారీగా కోత విధించారని వాపోయారు. గత వార్షిక బడ్జెట్లో 5,020.50 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్లో 3,097 కోట్లు కేటాయించి ముస్లింలపై చవితి ప్రేమ చూపించారని అన్నారు. అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కాలర్షిప్లు రద్దు చేయడం, గత సంవత్సరం స్కాలర్షిప్ల కోసం 1425 కోట్లు కేటాయిస్తే 23, 24 సంవత్సరములలో కేవలం 43 కోట్లు కేటాయించడం జరిగిందని ఇది చాలా దారుణమైన విషయమని అసహనం వ్యక్తం చేశారు. కానీ ముస్లిం మైనారిటీలకు సంబంధించిన అన్ని విషయాలలో కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని నిరాశ వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం డి అబ్దుల్ కలాం, జాయింట్ సెక్రెటరీ సయ్యద్ కలిలుల్లా, ట్రెజరర్ షేక్ సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *