Breaking News

9 వ తేదీ నుండి మేరీమాత ఉత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ భారతదేశంలో ప్రాధాన్యత సంతరించుకున్న గుణదల మేరీ మాత మహోత్సవములు ఫిబ్రవరి 9, 10, 11వ తేదీలలో జరగనున్నట్లు విజయవాడ పీఠాధిపతులు తెలుగుతోటి జోసెఫ్ రాజారావు తెలియజేశారు. 9వ తేదీన ప్రారంభమయ్యే ఈ మహోత్సవంలో భాగంగా ప్రతి రోజు ఉదయం ఏడు గంటలకు సమిష్టి దివ్యబలి పూజ తో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు మరియు వివిధ రాష్ట్రాల నుండి కూడా ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా పాల్గొంటారని తెలియజేశారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గుణదల కొండ ప్రాంతాన్ని , మేరీ మాత పుణ్య క్షేత్రాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ముందుగా శ్రీ మాత మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గాబ్రియేల్, ఏలేటి విలియం జయరాజు, మువ్వల ప్రసాదు, కొలకాని మరియన్న, తోట సునీల్ రాజు తదితర గురువులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *