Breaking News

ఘనం గా గుణదల మేరీ మాత ఉత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఎంతో పేరుగాంచిన పుణ్యక్షేత్రాలలో గుణదల మేరీ మాత పుణ్య క్షేత్రo ఒకటని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ప్రతి ఏడాది మూడు రోజులు పాటు ఎంతో వైభవంగా నిర్వహించే ఈ మహోత్సవ వేడుకల్లో తాను భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందదాయకం అన్నారు… మేరీ మాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.. గుణదల మేరీ మాత చర్చి నందు ఉత్సవాల సందర్భంగా ప్రతి యేడు ఎంతో ఘనంగా నిర్వహించే మేరిమాత విగ్రహా ఊరేగింపు కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిషప్ తెలగతోటి రాజారావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో తాను భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నాన్న స్వర్గీయ దేవినేని నెహ్రూ హయం నుంచే ప్రతి ఏటా తమ కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలు లో పాల్గొనటం జరుగుతుంది అని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం అని అన్నారు. 99 సంవత్సరాలుగా పుణ్యక్షేత్రంలో ఎంతో వైభవంగా మహోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి ఈ మహోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.మేరీ మాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కార్పొరేటర్లు నిర్మలాకుమారి,ప్రవల్లిక,అంబేద్కర్,అమరనాధ్,సీనియర్ నాయకులు డేవిడ్ రాజు,కోటి నాగులు,చిన్నబాబు,భీమిశెట్టి బాబు,నాని,చందా కిరణ్,కిస్సి,చెన్ను,రమేష్, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *