Breaking News

ఎపిలో 7 ఎంఎల్సి స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసిన రిటర్నింగ్ అధికారి పివి.సుబ్బారెడ్డి

అమరావతి,నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఈనెలాఖరుకు ఖాళీ అవుతున్న 7 ఎంఎల్ఏ కోటా ఎంఎల్సి అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పివి.సుబ్బారెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు.శాసన మండలి సభ్యులు చల్లా భగీరధ్ రెడ్డి పదవీ కాలం గత నవంబరు 2వ తేదీతో పూర్తి కాగా,ప్రస్తుత సభ్యులు నారా లోకేశ్,పోతుల సునీత,బచ్చుల అర్జునుడు,డొక్కా మాణిక్య వరప్రసాద రావు,వరాహ వెంకట సూర్యనారాయణ రాజు పెనుమత్స,గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది.ఈఎంఎల్సి అభ్యర్ధుల ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గతనెల 27వతేదీన ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడగా సోమవారం ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రకటనను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎంఎల్ఏ కోటా ఎంఎల్సి అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి మరియు రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి ఫారమ్-1 ద్వారా సోమవారం ఎన్నికల ప్రకటన చేశారు.ఎంఎల్సి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయగోరు అభ్యర్ధులు స్వయంగా గాని లేదా వారి ప్రతిపాదకుడు గాని వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభా భవనంలో రిటర్నింగ్ అధికారైన తన వద్దగాని లేదా సహాయ రిటర్నింగ్ అధికారి మరియు శాసన మండలి ఉపకార్యదర్శికి గాని వారి నామినేషన్లను సమర్పించవచ్చని సుబ్బారెడ్డి తెలిపారు.ఈనెల 6వతేదీ నుండి 13వ తేదీ వరకూ సెలవు దినాలు మినహా మిగతా పనిదినాల్లో ఉదయం 11గం.ల నుండి మధ్యాహ్నాం 3గం.ల వరకూ నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు.నామినేషన్ పత్రాలను పై పేర్కొన్న స్థలం,సమయాల్లో పొందవచ్చని వివరించారు.ఈనెల 14వతేదీన ఉదయం 11గం.లకు అసెంబ్లీ భవనంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈనెల 16వతేది మధ్యాహ్నం 3గం.ల వరకూ నామినేష్ల ఉసంహరణకు గడువు ఉంటుందని ఆగడువులోగా ఎవరైనా అభ్యర్ధులు వారి నామినేష్లనను ఉపసంహరించు కోవాలనుకుంటే అభ్యర్ధిత్వ ఉపసంహరణ నోటీసును అభ్యర్ధి లేదా వారి ప్రతిపాదకుడు లేదా వ్రాత పూర్వకంగా అందించేందుకు అధికారం పొందిన వారి ఎన్నిక ఏజెంటు గాని రిటర్నింగ్ అధికారి లేదా సహాయ రిటర్నింగ్ అధికారికి గాని అందజేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎంఎల్సి ఎన్నికలకు పోటీ ఉన్నచో ఈనెల 23వేతదీ ఉదయం 9గం.ల నుండి సాయంత్రం 4గం.ల వరకూ అసెంబ్లీ భవనంలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు.పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అదే రోజు అనగా 23వతేదీ సా.5గం.లకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *