Breaking News

ఘనంగా దేవినేని మురళి 35వ వర్థంతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద విద్యార్థులకు అండగా ఉంటూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఘనత యూ ఎస్ ఓ నాయకులు దేవినేని మురళి సొంతమని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ అన్నారు..మురళి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఆయన తెలిపారు. మురళి మరణించి 35 సంవత్సరాలు అవుతున్న నేటికి కళాశాల విద్యార్థుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఘనత మురళి సొంతమని చెప్పారు..యూ.స్.ఓ. రాష్ట్ర నాయకులు దేవినేని మురళి 35వ వర్ధంతి కార్యక్రమాన్ని గుణదల లోని తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ 7వ డివిజన్ శిఖామణి సెంటర్,9వ డివిజన్ పటమటలంక చేపల మార్కెట్,14వ డివిజన్ పటమట మీ సేవ,12వ డివిజన్ అయ్యప్ప నగర్ ఆర్చ్,10,11డివిజన్లు పటమట రైతు బజార్ నందు పండ్లు పంపిణి,4వ డివిజన్ నందు చీరలు పంపిణి,5వ డివిజన్ క్రీస్తురాజుపురం నందు అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించి దేవినేని మురళి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పై అలుపెరుగని పోరాటం చేసిన ఘనత మురళి ది అని కొనియాడారు. పేద విద్యార్థులకు దేవినేని కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. మురళి వర్ధంతి సందర్భంగా ఆయన స్నేహితులు, దేవినేని అభిమానులు, శ్రేయోభిలాషులు పండ్లు పంపిణీ, దుస్తులు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేయటం అభినందించదగ్గ విషయమన్నారు.మురళి మరణించి 35 సంవత్సరాలు అవుతున్న నేటికి అతని పేరు మీద సేవ కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులు, ఆయన స్నేహితులు గుండెల్లో పెట్టుకొని అరదీస్తున్నారన్నారు.దేవినేని మురళి,నెహ్రు,గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని అవినాష్ పేర్కొన్నారు..అనంతరం వైసీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పై దేవినేని మురళి నిత్యం పోరాడుతూనే ఉండేవారని గుర్తు చేశారు.పేద విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా అది పరిష్కారం అయ్యే వరకు మురళి అండగా నిలిచే వారని చెప్పారు.విద్యార్థి ఉద్యమ దశలోనే ప్రాణాలు విడిచి అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి దేవినేని మురళి అని అన్నారు.మురళి ఆశయ సాధన కోసం కృషి చేస్తూ దేవినేని అవినాష్ కి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. తూర్పు నియోజకవర్గన్నీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న అవినాష్ ని రాబోయే ఎన్నికల్లో ఎం ఎల్ ఏ గా గెలిపించి తీరుతామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగ అధ్యక్షలు కొరివి చైతన్య మరియు దేవినేని అభిమానులు,కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు,తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇంచార్జిలు,వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *