విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మెండు జ్యోతి ఆధ్వర్యంలో పలువురు బిసి సంక్షేమ సంఘం లో చేరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ జరిగిన కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గానరేష్ యాదవ్ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే జనగణన చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఆ హామీని విస్మరించిందని మండిపడ్డారు. మోదీని ఎదురించి 7 రాష్ట్రాలు జనగణన చేస్తున్నారని చెప్పారు. బిసిల కులగణన కు వైకాపా ప్రభుత్వం మద్దతు ఇస్తుందని చెప్పారు. ఈ నెల 3, 4 తేదీలలో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. నూతన కన్వీనర్ లు నియమించడం వల్ల పాత సంఘాలు రద్దవుతాయని చెప్పారు. అనంతరం బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మెండు జ్యోతి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాకు అధ్యక్షులుగా పోతిన వర ప్రకాష్, మహిళ అధ్యక్షురాలుగా కామరూపి నాగశ్రీ, విజయవాడ మహిళ అధ్యక్షురాలిగా ఎస్.కె నాగూర్ బి లను ప్రకటించారు. సంఘం ద్వారా గుర్తింపు పొంది కొంతమంది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అనేక పోరాటాలు చేసారని బిసిల సమస్యల పై పోరాడరని చెప్పారు. అలాంటి వ్యక్తి పై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. బోను దుర్గానరేష్ అధ్యక్షతన రాజమండ్రి లో 5000 మంది సభ నిర్వహించామని అలాంటి సభను నిర్వహిస్తే తాను వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. జాతీయ స్థాయిలో ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర స్థాయి లో బోను దుర్గానరేష్ తమ నాయకులు అని ఆమె స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News