-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
30-03-2023 తేదిన శ్రీరామనవమి సెలవు దినము సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థకు పన్ను చెల్లింపుదారులకు వారికి అనువుగా సెలవు రోజుల్లోనూ కూడా నగదు కౌంటర్లు ఉంటాయని కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ తెలిపారు. నగరపాలక సంస్థ మూడు సర్కిల్స్ కార్యాలయాలలో నగదు కౌంటర్లు పనిచేస్తాయన్నారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఆస్తి, నీటి, ఖాళీ స్థలం పన్నులు, డీఅండ్ వో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Prajavartha Online Telugu News