Breaking News

ఈనెల 29న విజయవాడలో డా.నటరాజరామకృష్ణ శతజయంతి ఉత్సవాలు

-ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 29వ తేదీ శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సా.5గం. లకు రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ వారి శతజయంతి ఉత్సవాలు మరియు అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్నినిర్వహించనున్నారు. ఈ శతజయంతి ఉత్సవాలకు సంబంధించి రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ప్రచురించిన గోడపత్రికను మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర దేవాదాయశాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు. పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ శతజయంతి ఉత్సవాలు మరియు అంతర్జాతీయ నృత్య దినోత్సవ గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమీషనర్ ఎస్.సత్య నారాయణ,రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి సిఇఓ ఆర్.మల్లిఖార్జున, దేవాదాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *