తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
మనకు సాయపడేదెవరు ఉపయోగపడేది ఎవరు? అనేది ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. గత నాలుగేళ్లుగా అనేక సంక్షేమ పథకాలతో మన కుటుంబాలకు లక్షలాది రూపాయలు ఆర్థిక సహాయం అందించిన జగనన్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందామని కొత్తూరు గ్రామ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొత్తూరు గ్రామంలో శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో సైతం కొత్తూరు గ్రామ ప్రజలు మాయమాటలు నమ్మి మోసపోయారన్నారు. అయినప్పటికీ వైకాపా ప్రభుత్వం లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారాఈ గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబం లక్షల రూపాయలు లబ్ధి పొందింది అన్నారు. గతంలో ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా మన కుటుంబాలకు ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఒక్క వైకాపా ప్రభుత్వం లోనే ముఖ్యమంత్రి జగనన్న హయాంలోనే సంక్షేమ పథకాల ద్వారా ఇలా జరుగుతుందన్నారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని ఇలాంటి ముఖ్యమంత్రిని నిలబెట్టుకోవాల్సిన అవసరం మన అందరి పైన ఉందన్నారు. మాయ మాటలు అబద్ధాలు మోసపుచ్చేవారిని నమ్మితే నట్టేట మునిగిపోతామని నష్టపోతామని మంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. కొత్తూరు ప్రజలు ఇకనైనా మేలుకోవాలని మనకు ఆర్థికంగా అండగా నిలబడే వైకాపా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈసారి కచ్చితంగా అలా చేస్తారని నమ్మకం కలుగుతుంది అన్నారు పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు వైకాపా ప్రభుత్వం జగనన్న ఇంటి కోసం ఇస్తున్న సెంటు స్థలాన్ని స్మశానానికి కూడా సరిపోదని వ్యాఖ్యానించడం చంద్రబాబు పైశాచికత్వానికి నిదర్శనమని మంత్రి కొట్టు విమర్శించారు. పేదవాడి కోసం వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు మనోడు అనుకునే పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని గెలిపించాలని చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి దుర్మార్గులను ఒక కంట కనిపెట్టాలని మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని గడపగడపకు వెళ్లి ప్రతి కుటుంబానికి వైకాపా ప్రభుత్వంలో జగనన్న సంక్షేమ పథకాల ద్వారా అందిన ఆర్థిక లబ్ధిని గణాంకాలతో సహా తెలియజేశారు. సంతోషమేనా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవచ్చా అని మంత్రి కొట్టు ప్రశ్నించగా ప్రజలు స్పందిస్తూ పెట్టే ప్రభుత్వాన్ని కచ్చితంగా నిలబెట్టుకోవాలని ఈసారి వైకాపాకే ఓటు వేస్తామని మహిళలు ముక్తకంఠంతో బదులిచ్చారు. ఒక్క క్లస్టర్ పరిధిలోనే 50 కుటుంబాలకు సుమారు కోటిన్నరకు పైగా ఆర్థిక లబ్ది చేకూరడం విశేషంగా నిలిచింది ప్రతి కుటుంబం లక్షల రూపాయల్లోనే లబ్ధి పొందింది గరిష్టంగా ఐదు లక్షల 27 వేల 990 రూపాయలు ఆర్థిక లబ్ధి జగనన్న సంక్షేమ పథకాలు ద్వారా ఒక కుటుంబం పొందిందంటే ఏ స్థాయిలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయో అర్థం అవుతుంది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి మండల వైకాపా కన్వీనర్ ముప్పిడి సంపత్ కుమార్ మండల వైకాపా అధ్యక్షుడు కొమ్ముగూడెం సొసైటీ చైర్మన్ వెలిశెట్టి నరేంద్ర కుమార్ పంచాయతీ కార్యదర్శి విఆర్ఓ సచివాలయం ఉద్యోగులు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News