Breaking News

నగరిలో సమ్మర్ క్యాంపును ప్రారంభించిన మంత్రి ఆర్.కె.రోజా

నగరి, నేటి పత్రిక ప్రజావార్త :
నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో సమ్మర్ క్యాంపు ను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా  బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశం లో మంత్రి గారు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో పాల్గొంటే సమాజంలో ఎలా బ్రతకాలో తెలుస్తుందని అన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు క్రీడాల్లో పాల్గొనడం వలన మానసిక వికాసం పెరుగుతుందని తెలిపారు.

ఇండోర్ స్టేడియం ప్రారంభం
నగరి లో ఇండోర్ స్టేడియం ను మంత్రి శ్రీమతి ఆర్. కె రోజా గారు మరియు చిత్తూరు ఎస్.పి.రిశాంత్ రెడ్డి లు బుధవారం ప్రారంభించారు. బాల్ బాడ్మింటన్ , షట్టల్, క్రికెట్, టేబుల్ టెన్నిస్ క్రీడాలలో వారు పాల్గొని క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చారు. ఈ సమావేశం లో నగరి నియోజకవర్గంలోని మునిసిపల్ చైర్మన్లు, ఎంపీపీ లు, వైస్ చైర్మన్లు, వైస్ ఎంపీపీ లు, కౌన్సిల్లర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, రాష్ట్ర డైరెక్టర్ లు, కమిటీల చైర్మన్లు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *