సెంట్రల్ నియోజకవర్గంలో 14,605 మందికి జగనన్న విద్యాకానుక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నియోజకవర్గంలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 14,605 (6,823 బాలురు + 7,782 బాలికలు) మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక వర్తించనున్నట్లు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 12న ప్రతి ఒక్క విద్యార్థికీ నోట్‍ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, 3 జతల దుస్తులు, బూట్లు, బెల్టు, 2 జతల సాక్సులు అందించనున్నట్లు తెలియజేశారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలనే ఉత్సాహం తల్లిదండ్రుల్లో ఉండేది కాదని.. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో పెనుమార్పులు వచ్చాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అయితేనే తమ పిల్లలను చదివిస్తామనే విధంగా చిన్నారుల తల్లిదండ్రులలో మార్పు వచ్చిందన్నారు. తెలుగుదేశం హయాంలో విద్యా సంవత్సరం సగం పూర్తయినా కూడా పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందేవి కాదని మల్లాది విష్ణు అన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో తొలి రోజే అందిస్తుండటం హర్షించదగ్గ విషయమన్నారు. విద్యా వ్యవస్థపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ.. దేశంలో మరే ప్రభుత్వం సారించలేదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పునరుద్ఘాటించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *