విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 10వ డివిజన్,42వ సచివాలయం పరిధిలోని టీచర్స్ కాలనీ,NSR నగర్,Rtc కాలని ప్రాంతాలలో సంక్షేమ లబ్ది అందుకొన్న ప్రతి కుటుంబాన్ని అవినాష్ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేసి ఆ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాధరణ పొందుతున్నదని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏఏ స్థాయిలో , ఏఏ వర్గాలకు, చెందుతున్నాయో, ఏమాత్రం చెందుతున్న అన్న అంశంపై ఆరా తీసి అడిగి తెలుసుకున్నాం అన్నారు.గత పదిరోజులుగా 10వ డివిజన్ కాలనీలలో పర్యటిస్తుంటే ప్రజలు వైస్సార్సీపీ కి స్వగతం పలుకుతుంటే చాల ఆనందంగా ఉంది అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ సంక్షేమ పథకాలైన నవరత్నాలు తదితర అంశాలు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో జగన్ పై నమ్మకం కుదిరించుకుంటూ అభివృద్ధి దృష్టిలో పయనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన హామీలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసి ఎన్నికల హామీని ఎందుకు నెరవేర్చా లేకపోయవని ప్రశ్నించారు.వీటిపై టీడీపి నేతలు సమాధానం చెప్పాలని కోరారు.ప్రజల కి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి జగన్ తన నిజాయితీ నిలబెట్టుకున్నారు అన్నారు.అవినీతికి తావులేని పాలతో ప్రజలకు మేలు జరుగుతుంటే ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ప్రజలంతా జగన్ తోనే ఉన్నారని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి బుద్ధి చెప్పి తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ ఇన్ ఛార్జ్ కరుటూరి హరీష్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,డివిజన్ నాయకులు అచ్చుతరావు,తోట వాసు,శేఖర్,ఉదయ్,ముత్తవరపు శ్రీనివాస్,చిమటా బుజ్జి,కావడి దామోదర్,మానుపూడి చిరంజీవి,తమ్మారెడ్డి ప్రకాష్ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News