Breaking News

ఉచిత పుస్తక వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రామ్మోహన గ్రంథాలయం గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత పుస్తక వితరణ కార్యక్రమాన్ని ఈరోజు జూన్ 9 నుండి ఆదివారం జూన్ 11 వరకు నిర్వహిస్తుంది. అయితే కొన్ని విద్యాసంబంధ పుస్తకాలు విద్యార్థులకు ఉపయోగపడాలనే లక్ష్యంగా పాఠశాలలు తెరుచుకునే ముందే గ్రంథాలయం నిర్వహిస్తోంది. పిల్లల కథల పుస్తకాలు, నవలలు, ఆధ్యాత్మిక పుస్తకాలు వ్యక్తిత్వ వికాస వైద్య మరియు వాణిజ్య శాస్త్ర పుస్తకాలు, పోటీ పరీక్షల వివిధ ప్రవేశ పరీక్షల పుస్తకాలు ఈ వితరణలో ఉన్నాయి. గ్రంథాలయ కమిటీ అధ్యక్షులు  చింతలపూడి కోటేశ్వరరావు ఈరోజు ఉదయం 9 గంటలకు భరతమాత మరియు గ్రంథాలయ పితామహ పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్యకు వందన సమర్పణతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యదర్శి వేములపల్లి కేశవరావు ఈ పుస్తకాలను సంగ్రహించడానికి సహకరించిన పుర ప్రముఖులకు, రచయితలకు, పుస్తకదాతలకు ధన్యవాదాలు అర్పిస్తూ విద్యార్థులు తరచుగా ఈ గ్రంథాలయ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఉదయం నుండి 200 మంది పైగా పాఠకులు గ్రంథాలయానికి విచ్చేసి తమకి కావలసిన పుస్తకాలను తీసుకుని వెళ్లారు. ఉపాధ్యక్షులు  దమ్మాల రామచంద్ర రావు ఈ కార్యక్రమాన్ని రెండు రోజులుగా ప్రచారం చేయడమే కాకుండా స్వయంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పర్యవేక్షిస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *