మహిళల ఆర్థిక అభ్యున్నతికి చేయూత

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిఒక్క పథకం ఆడపడుచుల జీవితాలలో పండుగ వాతావరణం తీసుకొస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 26వ డివిజన్ 28వ సచివాలయ పరిధి కాకర్ల వారి వీధిలో శుక్రవారం వైఎస్సార్ చేయూత, కాపునేస్తం లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో తామంతా సంతోషంగా ఉన్నట్లు ఈ సందర్భంగా అక్కచెల్లెమ్మలు ఎమ్మెల్యేకు వివరించారు. సీఎం జగనన్న ఏ పథకం ప్రారంభించాలన్నా, మహిళల కళ్లల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే చేపడతారని మల్లాది విష్ణు తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా మహిళలకు గౌరవం పెరగాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలోని 10,875 మంది ఆడపడుచులకు మూడు విడతలలో రూ. 43 కోట్ల 38 లక్షల లబ్ధి చేకూర్చగా.. సచివాలయ పరిధిలో 97 మంది ఖాతాలలో రూ.54 లక్షల 56 వేల 250 జమ చేసినట్లు పేర్కొన్నారు. కాపునేస్తం ద్వారా నియోజకవర్గంలో 1,956 మందికి రూ. 8 కోట్ల 53 లక్షల లబ్ధి జరగగా.. సచివాలయ పరిధిలో 38 మందికి రూ.11.40 లక్షల మేలు చేకూరిందన్నారు. ఈ సాయంతో కూరగాయలు, పచ్చళ్లు, టిఫిన్స్, పాల వ్యాపారం, చీరలు, బొమ్మలు, బట్టలు, కిరాణా వంటి వ్యాపారాలు ప్రారంభించినట్లు అక్కచెల్లెమ్మలు చెప్పడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. వ్యాపార రంగంలో ఒక్కసారి మనం పెట్టే పెట్టుబడి.. మన కుటుంబానికి రోజువారీ ఆదాయాన్ని సంపాదించి పెడుతుందని మల్లాది విష్ణు అన్నారు. అలాగే సచివాలయ పరిధిలో 260 మంది ఆడపడుచులకు ఇంటి పట్టాలు మంజూరు చేసినట్లు తెలియజేశారు. వీటితో పాటు ఆసరా, సున్నావడ్డీ, అమ్మఒడి, ఈబీసీ నేస్తం వంటి పథకాల ద్వారా నిజమైన మహిళా సాధికారితకు, ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం దారులు పరుస్తోందని మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న సాయాన్ని తమ ఆర్థిక పురోభివృద్ధికి వినియోగించుకుని ముందుకు సాగాలని.. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని నిండు మనసుతో దీవించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ, కోఆర్డినేటర్ కోలా నాగాంజనేయులు, వైఎస్సార్ సీపీ నాయకులు, లబ్ధిదారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *