-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
-అర్జీదారుల సంతృప్తే లక్ష్యం, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ అధికారులతో కలిసి సోమవారం నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు స్పందన కార్యక్రమము నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన అర్జిలను స్వీకరించి, వారి యొక్క సమస్యల వివరాలు అడిగి తెలుసుకొని వచ్చిన అర్జీలు అన్నియు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని అన్నారు. అర్జీదారుని సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నగరపాలక సంస్థ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో వారు ఎదుర్కోను ఇబ్బందుల పట్ల అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా , సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. గతవారం వచ్చిన సమస్యల పరిష్కారం పై కమిషనర్ అధికారులతో సమీక్షించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమము లో 11 సమస్యలు ప్రజల నుండి వచ్చాయన్నారు. ముఖ్యంగా త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ కాలువల సమస్యలు ప్రజలు మా దృష్టికి తెచ్చారని అన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు.
స్పందన కార్యక్రమములో ప్రధానంగా ఇంజనీరింగ్ విభాగం – 2, పట్టణ ప్రణాళిక విభాగం – 4, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి)- 3 పబ్లిక్ హెల్త్ విభాగం – 1, రెవిన్యూ – 1 విభాగాములకు సంబందించిన అర్జీలు వచ్చినవి.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, బయాలజిస్ట్ సూర్య నాయక్, మేనేజర్ బి.శ్రీనివాస్ రావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 2 అర్జీలు
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 2 కార్యాలయంలో పట్టణ ప్రణాళికవిభాగం – 1, రెవిన్యూ– 1 అర్జీలు, సర్కిల్ – 1 మరియు సర్కిల్ –3 కార్యాలయంలో ఎటువంటి అర్జీలు రాలేదని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.
Prajavartha Online Telugu News