Breaking News

ప్రజా సంక్షేమం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్య పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జి దేవినేని అవినాష్ తెలిపారు. 12 డివిజన్ ప్రాంతంలో నూతనంగా పాఠశాల భవనంతో పాటు సబ్ స్టేషన్ నిర్మించామని చెప్పారు. కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివ్రద్ధి పనులు చేపట్టినట్లు అవినాష్ వివరించారు.12 డివిజన్ 49వ సచివాలయ పరిధిలోని పండరిపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అవినాష్ పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లామని రెండో విడత 12 వ డివిజన్ నుంచి ప్రారంభించామన్నారు. జగన్ నాయకత్వంలో నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అనేక అభివ్రద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముఖ్యంగా 12 వడివిజన్ లో పాఠశాల పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకొని నాడు నేడు పథకం ద్వారా రెండతస్తుల భవనాన్ని నిర్మించామన్నారు. విద్యుత్ సమస్యలు లేకుండా సబ్ స్టేషన్ కూడా నిర్మించామని ఆయన గుర్తుచేశారు. జగన్ పాలనపట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి రానున్న కాలంలో వారికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అవినాష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్, వైస్సార్సీపీ నాయకులు ఖలీమ్, సాయిబాబు, శ్రీనివాసరావు, అబ్దుల్లా, సుగుణేశ్వర రావు,బ్రమ్మమ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *