జిల్లాను కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చి దిద్దాలి…

-కలెక్టరు డా. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా నుంచి లెప్రసిని సమ్మూలంగా నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నామని ఆదిశలో రెండు నెలల క్రితం బాధితులకు పౌష్టికాహారపు కిట్స్ కూడా పంపిణీ చేశామని కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన హాల్లో జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన కార్యక్రమం పై అవగాహన అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ మన దేశంలో ఇప్పటికే పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించామని, ఆదేవిధంగా కుష్టు వ్యాధి ప్రభలకుంటూ ముందుకు జాగ్రత్తతో జిల్లానుంచి లెప్రసీ వ్యాదిని పారద్రోలాలన్నారు. లెప్రసి వ్యాధికి గురవుతారు అన్న విషయం తొలిదశలో గుర్తించడం ద్వారా చికిత్స అందించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా సత్వర చికిత్స సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. లేప్రేసి పై అవగాహన ద్వారా వ్యాధిని గుర్తించడం సాధ్యం అని, అందుకు అనుగుణంగా డాక్టర్లు సూచించిన విధంగా మందులు తీసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. అభద్రతాభావం విడనాడి నిర్భయంగా బయటకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ కోరారు. వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమైకం అవుతున్న దృష్ట్యా వారిపై మరింత బాధ్యత ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో పంచాయతీ రాజ్, మునిసిపల్, వైద్య ఆరోగ్య, సమాచార శాఖల ద్వారా అవగాహన కల్పించడం ద్వారా జిల్లా లెప్రసి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్, డీఆర్వో జి. నరశింహులు, జిల్లా ఎయిడ్స్, కుష్టు వ్యాధి నియంత్రాణాధికారి, డా. ఎన్. వసుంధర, డి ఎం హెచ్ ఓ డా కే. వేంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *