Breaking News

ఆరోగ్యశ్రీ ద్వారా ఉత్తమ సేవలు అందించే ఆరోగ్య మిత్రకు రూ.5 వేలు నగదు పురస్కారం

-కలెక్టరు డా. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్తమ పనితీరు కనబర్చిన ఆరోగ్య మిత్రకు ప్రతి నెల ఒక్కొక్కరికి చొప్పున రు.5 వేలు నగదు పురస్కారం అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు.

సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమం లో ఇద్దరు ఆరోగ్య మిత్రాలు 5 వేలు చొప్పున చెక్కును కలెక్టర్ మాధవీలత, జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ పి. ప్రియాంక అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆ మేరకు ఆరోగ్యశ్రీ పథకం కింద వాటిని అమలు చేయడంలో విధినిర్వహణలో బాధ్యతాయుతంగా ఉత్తమ సేవలందించిన రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డులోగల గౌతమి కంటి ఆస్పత్రి ఆరోగ్యమిత్ర కె. పుష్పకుమారి కి ఏప్రిల్ మాసం నకు, రాజమహేంద్రవరం కమలాకర గుండే ఆస్పత్రిలో ఆరోగ్యమిత్రగా పనిచేస్తున్న యం. సత్యనారాయణకు మే మాసం కు సంబందించి రూ.5 వేలు చొప్పున చెక్కును అందజేశామన్నారు. ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రులలో అందుబాటులో ఉండే ఆరోగ్య మిత్రాలు ఎంతో సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించడం జరుగుతోందని అన్నారు. ఆ క్రమంలో వారు అందచేసే సేవలు ఆధారంగా ప్రతి నెలా ఒక ఆరోగ్య మిత్రాకు రూ.5 వేల నగదు ప్రోత్సాహకం అందించడం జరుగుతుందని అన్నారు. ఆమేరకు జిల్లాకు చెంది 2023 ఏప్రిల్, మే నెలల్లో ఇద్దరినీ ప్రోత్సాహాన్ని అందించడం జరిగిందని కలెక్టరు మాధవీలత పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల ఆరోగ్య మిత్రలను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్, డీఆర్వో జి. నరశింహులు, జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ పి. ప్రియాంక తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *