Breaking News

స్వచ్చంద సంస్థల సహకారం తోడు కావటం అభినందనీయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యా రంగానికి అందిస్తున్న ప్రభుత్వ సహకారానికి స్వచ్చంద సంస్థల సహకారం తోడు కావటం అభినందనీయమని కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు.
స్థానిక అజిత్‌ సింగ్‌ నగర్‌ లోని ఇందిరా నాయక్‌ నగరంలో బుధవారం హ్యాపీ లైఫ్‌ ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ, , డాక్‌ సెల్‌ జాతీయ అవార్డు గ్రహీత, రిటైర్డ్‌ పోస్టు మాస్టర్‌ ఆర్‌ రామచంద్రరావు, చుక్కపల్లి ఫౌండేషన్‌ సహకారంతో విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ పంపిణీ కార్యక్రమానికి ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్‌, జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, నగర పాలక సంస్థ కమిషనర్‌ స్వప్నల్‌ దినకర్‌ పుడ్కర్‌ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ సామాన్య పోస్టు మాస్టర్‌ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన్నప్పటికి స్వచ్‌ విజయవాడ కు సహకారం అందించేందుకు ముందుకు రావడం అబినందనీయమన్నారు. 26 సంవత్సరాల నుండి పేద విద్యార్థులకు పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తూ ప్రతీ ఒక్కరికి ఆదర్శప్రాయులు అయ్యారన్నారు. విద్యార్థులు శ్రద్దగా చదువుకుని ఉన్నత స్థాయి చేరుకోవాలన్నారు. వీటీతో పాటు రామచంద్రరావు మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం ఒక అలవాటుగా చేసుకుని స్వచ్‌ విజయవాడకు సహకారం అందిస్తున్నారన్నారు. ఆయన చేస్తున్న సేవలను స్పూర్తిగా తీసుకుని సమాజానికి తమ వంతు కృషి చేస్తున్నారన్నారు.
ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి తొలి ప్రాధాన్యత ఇచ్చి ఉచితంగా జగనన్న విద్య కానుక కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. వీటితో పాటు ప్రతీ సంవత్సరం దాతలు ముందుకు వచ్చి తమ సహకారన్ని అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు త్రిపుల్‌ ఐటి వంటి ఉన్నత చదువులకు టాప్‌ ర్యాంకులుగా నిలుస్తున్నారన్నారు.
నగర పాలక సంస్థ కమిషనర్‌ స్వప్నల్‌ దినకర్‌ పుడ్కర్‌ మాట్లాడుతూ విశ్రాంత పోస్టు మాస్టర్‌ రామచంద్రరావు కాలనీలలో మొక్కలను నాటి స్వచ్చత పై దృష్టి పెట్టడం అభినందనీయమన్నారు. కాలనీ రహదారికి ఇరుపక్కల మొక్కలు నాటి వాటి సంరక్షించడం వల్ల నేడు ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉందని అన్నారు.
కార్యక్రమంలో విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో డిప్యూటి మేయర్‌ అవుతు శ్రీ శైలజరెడ్డి, చుక్కపల్లి పౌండేషన్‌ సాత్విక్‌, స్వచ్చంద సంస్థ ప్రతినిధులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *