Breaking News

ప్రతి ఒక్కరికి లబ్ది చేకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ది చేకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా వాలంటీర్‌, సచివాలయ సిబ్బంది సహకారంతో వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని రాష్ట్ర హోమ్‌, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి తానేటి వనిత అన్నారు.
స్థానిక కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర హోమ్‌, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి తానేటి వనిత అధ్యక్షతన పశ్చిమ నియోజకవర్గ స్థాయిా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తూ దీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయిలో రెండు టీమ్‌లు, జిల్లా స్థాయిలో ఒక టీమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా స్థాయి టీమ్‌లో ఇన్‌చార్జ్‌ మంత్రి, జిల్లా కలెక్టర్‌ , శాసనసభ్యులు, జిల్లా కి చెందిన మంత్రులు ప్రతీ నియోజకవర్గంలో సమస్యలను తెలుసుకుని పెండిరగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించడం జరుగుతుందన్నారు. ఆయా స్థాయిలో సమస్యలను పరిష్కరించుకుని పరిష్కారం కాని వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకరావడం జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల కాలంలో ప్రతీ గ్రామంలో ప్రతీ ఒక్కరి సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఇంకనూ పరిష్కరించాల్సిన సమస్యలను తెలుసుకుని నూరు శాతం సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ప్రతీ సచివాలయ పరిధిలో సమస్యలుతెలుసుకోవడానికి అక్కడ ఉన్న మండల స్థాయి అధికారులను రెండు టీమ్‌లుగా ఏర్పాటు చేశామన్నారు. వాలంటీర్లను ద్వారా మందుగా సమస్యలను తెలుసుకుని టోకెన్‌లను అందించి క్యాంపులను నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. జిల్లా స్థాయిలో టీమ్‌ను ఏర్పాటు చేసి మండల, జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకుని ఏ స్థాయిలో పరిష్కరించవలసిన సమస్యలను ఆ స్థాయిలో పరిష్కరించి ఇంకనూ పరిష్కరించాల్సిన వాటిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకురావడం జరుగుతుందన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానంగా వచ్చిన ఇంటి స్థలాల సమస్యలు, గతంలో కొంతమంది ఆర్‌అండ్‌బి, రైల్వే, ఇరిగేషన్‌ భూములలో గృహాలు నిర్మించుకుని నివాసం వుంటున్న వారికి ఏవిధంగా అక్కడ స్థిరమైన నివాసంతో భధ్రత కల్పించేందుకు సమావేశంలో చర్చించామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ది చేకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. టిడ్కో గృహాలకు సంబంధించి నియోజక వర్గంలో ఎదుర్కొంటున్న సమస్యలను, త్రాగు నీరు, విద్యుత్‌ వంటి వాటిని కూడా సమావేశంలో చర్చించామని మంత్రి అన్నారు.
వాలంటీర్ల సేవలు అభిందనీయం:
కరోనా కష్టకాలంలో ఫ్రంట్‌ లైన్‌ వర్క్‌ర్లగా విశేషమైన సేవలందించారని గుర్తు చేశారు. వాలంటీర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులను నిర్వర్తించి రోగులకు సేవలందించారని అన్నారు. కుటుంబ సభ్యులే దూరంగా పెట్టిన సమయంలో వాలంటీర్లు తమ సొంత కుటుంబ సభ్యులుగా భావించి ప్రాణాలకు తెగించి సేవలందించారన్నారు. అనేక రాష్ట్రాలు మన వాలంటీర్ల వ్యవస్థను అభినందిస్తూ ఆయా రాష్ట్రాలలో అమలు చేసే విధంగా ఉత్సాహాం చూపుతున్నారన్నారు.

మాజీ మంత్రి శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో అక్రమణలను క్రమబద్దీకరించడం, శాఖల మధ్య సమన్వయంతో పరిష్కరించవలసిన వాటిని తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా 38, 40 డివిజన్‌లోని రెవెన్యూ ఇరిగేషన్‌ శాఖలకు సంబంధించి కరకట్ట సౌత్‌ ల్యాండ్‌, 41 డివిజన్‌లో ఇళ్ళ పట్టాలు, దర్గా స్థలం , 43 డివిజన్‌లో ఊర్మిళ నగర్‌లో 22ఏ స్థలం, 56 డివిజన్‌లో రైల్వే శాఖకు సంబంధించిన భూమి, 35వ డివిజన్‌లో పిడబ్ల్యుడికి (చెక్క పెట్టెలు)సంబంధించి స్థలం, 34 డివిజన్‌లో పప్పుల మిల్లు వద్ద హౌస్‌ సైట్‌, కాపు కమ్యూనిటి హాల్‌ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, వక్ఫ్‌బోర్డ్‌ సంబంధించిన షాదీఖానా నిర్మాణాలు, టిడ్కో గృహాల పంపిణీ, తదితర అంశాలపై సమావేశంలో చర్చించామన్నారు.
తొలుత నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర హోమ్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కరోనా అనంతరం అన్ని పుణ్య నదులలో భక్తులు పుణ్యస్థానాలు అచరిస్తున్నారని అయినప్పటికి దుర్గా ఘాట్‌ను నేటి వరకు భక్తులకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదని ఆలయ ఇవో, దేవాదాయ శాఖ అధికారులను మంత్రి కారణం అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన కృష్ణానదిలో పుణ్యస్థానాలు అచరించేందుకు భక్తులకు ఇబ్బంది లేకుండా దుర్గా ఘాట్‌ను తిరిగి వినియోగింలోకి తీసుకురావాలన్నారు. దేవాదాయ, ఇరిగేషన్‌ శాఖల సమన్వయంతో దుర్గా ఘాట్‌ను శుభ్రపరిచి పోలీస్‌ వారి సూచనల మేరకు రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కనక దుర్గ నగర్‌లో కంటైనర్‌ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.
సమావేశంలో కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ రెవెన్యూ, నగర పాలకసంస్థ అధికారుల సమన్వయంతో నియోజకవర్గ పరిధిలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో సంబంధిత ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులతో సమస్యలను సమీక్షిస్తూ పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్‌ డిల్లీరావు మంత్రికి వివరించారు.
నగర పాలక సంస్థ మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌ నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు , దీర్ఘకాలిక సమస్యలను అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
సమావేశంలో నగరంలోని విద్యాధరపురం న్యూ లేబర్‌ కాలనీ శిధిలావస్థలో ఉందని దానిని తొలగించి ఒక్కొక్క కుటుంబానికి సెంటు స్థలం రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని విద్యాధరపురం న్యూ లేబర్‌ కాలనీ వాసుల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా అర్హతను పరిశీలించి నిబంధనల మేరకు సమస్యను పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.
సమావేశంలో శాసనమండల సభ్యులు యండి రుహుల్లా, నగర్‌ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ డా. పి సంపత్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, కనకదుర్గ ఆలయ ఇవో భ్రమరాంబ, డిఇవో సివి రేణుక, హౌసింగ్‌ పిడి రజనీ కుమారి, నగరపాలక సంస్థ అడిషనల్‌ కమీషనర్‌ శ్యామల, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *