-సమాచార హక్కు చట్టం అవగాహన అంశం పై సమాచార హక్కు చట్టం, కమీషనర్ ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి
-సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యం లో “డిప్లొమా ఇన్ జర్నలిజం” కోర్సు విద్యార్థులతో పాటు, రాష్ట్రం లోని వర్కింగ్ జర్నలిస్టులకు నిర్వహిస్తోన్న ఆన్ లైన్ అవగాహనా తరగతుల్లో భాగంగా ఈ శనివారం (22-07-23)న , తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి ప్రత్యేక ప్రసంగం ఇవ్వ నున్నారని ఆ సంస్థ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. “మాధ్యమాలు – తెలుగు భాష” అనే అంశం పై శనివారం ఉదయం 9నుంచి 10 గంటల వరకు శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి ప్రసంగిస్తారని ఆ ప్రకటన లో చైర్మన్ పేర్కొన్నారు. రచనా వ్యాసాంగం లో విశిష్ట అనుభవం వున్న నందమూరి లక్ష్మీ పార్వతి ప్రసంగం గొప్ప అవకాశమని,”డిప్లొమా ఇన్ జర్నలిజం” కోర్సు విద్యార్థులు, వర్కింగ్ జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అదే రోజు “సమాచార హక్కు చట్టం అవగాహన ” అనే అంశం పై సమాచార హక్కు చట్టం, కమీషనర్ ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి ఉదయం 8నుంచి 9 గంటల వరకు ప్రత్యేక ప్రసంగం ఇస్తారని, డిప్లొమా ఇన్ జర్నలిజం” కోర్సు విద్యార్థులు, వర్కింగ్ జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ గా తాము అధ్యక్షత వహిస్తామని, కోర్సు కోఆర్డినేటర్ ఎల్.వి.కె. రెడ్డి పరిచయ కర్తగా, మీడియా అకాడమీ కంటెంట్ ఎడిటర్ కలమండ శరత్ బాబు సమన్వయ కర్తగా వ్యవహరిస్తారని చైర్మన్ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News