విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం నాడు వైస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ చిట్యాల ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు 90,000 వేల రూపాయలను దేవినేని నెహ్రు చారిటబుల్ ట్రస్ట్ తరుపున రజక సంఘం నాయకులకు అందజేయడం జరిగింది. ఈ సంధర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోనే మొట్ట మొదటి చిట్యాల ఐలమ్మ విగ్రహం విజయవాడ నగరంలో ఏర్పాటు చేస్తున్నందుకు నిర్వహులకు అభినందనలు తెలియజేసారు. తూర్పు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రజకులు కుల వృత్తులు చేసుకోవడానికి అవసరం అయిన దోభీ ఖానాల అభివృద్ధికి దాదాపు 1కోటి రూపాయలు పైగా వెచ్చించడం జరిగిందని అవినాష్ తెలిపారు. దేవినేని నెహ్రు హయాంలో కూడా నియోజకవర్గంలో రజకుల పెద్ద పీట వేసి కార్పొరేటర్లను చేసిన నాయకులు నెహ్రు మాత్రమే అని అవినాష్ తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కుల వృత్తులు చేసుకునే రజక సోదరులుకు అవసరం అయిన ఏ ఒక్క మౌళిక సదుపాయాలను కలిపించలేదు అని అవినాష్ అన్నారు. గత 40 సంవత్సరాలుగా రజకులు అంత తమ వెన్ను దన్నుగా నిలుస్తున్నందుకు అవినాష్ వారికి కృతఙ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజులో రజక సోదరులకు ఎటువంటి అవసరం వచ్చిన ఎల్లపుడు వారికీ అండగా ఉంటామని అవినాష్ తెలియజేసారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల వల్ల కుల వృత్తులు వారికి ఎంతో చేయూత గా ఉంటుందని 2024 కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నే గెలిపించుకుంటామని రజక సోదరులు అంత కలిసికట్టుగా వైస్సార్సీపీ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి కృషి చేస్తామని చెప్పడం చాల సంతోషంగా ఉంది అని అవినాష్ అన్నారు. ఈ కార్యక్రమములో ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైత్యన (వర) కార్పొరేటర్లు వియ్యపు అమర్నాధ్,తాడిపత్రి కొండా రెడ్డి, రజక సంఘం నాయకులు ఉకోటి రమేష్,పటమట దుర్గా ప్రసాద్,పొనుగుపాటి శ్రీను, చిన్ని, వాసు,రాము మరియు ముఖ్య రజక నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News