Breaking News

పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం

 

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డితో కలిసి బుధవారం మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పచ్చదనం పరిఢవిల్లితేనే మానవాళి మనగడ సాధ్యమవుతుందన్న విషయాన్ని బాధ్యతగల పౌరులందరూ గ్రహించాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. అడవుల విస్తీర్ణం తగ్గిపోయి పట్టణాలు, గ్రామాలు కాంక్రీట్ జంగిల్స్‌ గా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో.. మన ఇంటి పరిసరాల్లో పచ్చదనాన్ని పెంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మల్లాది విష్ణు అన్నారు. నానాటికి పెరుగుతున్న కాలుష్య కోరల నుంచి నుంచి బయటపడాలంటే.. మొక్కలను పెంచడం ఒక్కటే మార్గమన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగనన్న పచ్చతోరణం పేరిట కొన్ని లక్షల మొక్కలు నాటినట్లు మల్లాది విష్ణు చెప్పారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటుతుండటంతో క్రమంగా నియోజకవర్గంలో పచ్చదనం పెరుగుతోందన్నారు. కొత్తగా నిర్మితమవుతున్న జగనన్న కాలనీలలోనూ తప్పనిసరిగా మొక్కలు పెంచాలనే నిబంధనను ప్రభుత్వం విధించిందని గుర్తుచేశారు. చెట్లే మానవ జాతికి గురువులని.. కనుక ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను దత్తత తీసుకోవాలని మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. మొక్కలను నాటి వదిలేయడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. ట్రీ గార్డులను ఏర్పాటు చేయడం ద్వారా 95 శాతానికి పైగా మొక్కలను కాపాడుకోవచ్చన్నారు. ప్రభుత్వ అధికారులు, కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంస్ధలు పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. తత్ఫలితంగా విజయవాడ నగరమంతా పచ్చదనం పరిఢవిల్లుతుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్కు సూపర్ వైజర్ విక్టర్, నాయకులు ఆత్మకూరు సుబ్బారావు, గుండె సుందర్ పాల్, ఉమ్మడి వెంకట్రావు, తోపుల వరలక్ష్మి, శోభన్, నాగుల్ మీరా, బుజ్జి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *