Breaking News

ఆంధ్ర హాస్పిటల్స్ లో 8 మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రహాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీ సౌజన్యంతో 8 మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ రమణ దన్నపనేని లివర్ పూల్ హాస్పిటల్స్, యు,కె నుండి విచ్చేసి ఈ క్యాంపులో సర్జరీలు చేసారు.

విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ హార్ట్ అండ్ బ్రెయిన్ విభాగంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్ర హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ డా. పి వి రామారావు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇప్పటివరకు గుండె శాస్త్ర చికిత్సలు క్యాంపులు నిర్వహించామని. క్లిష్టమైన గుండె జబ్బులు ట్రాన్స్ పోసిసస్ ఆఫ్ గ్రేట్ ఆర్థరీస్, టెట్రాలజీ ఆఫ్ ఫాలో ఆబ్సెంట్ పల్మనరీ వాల్వ్, సింగిల్ వెంట్రికల్ ఫిజియాలజీ క్లిష్టమైన గుండె ఆపరేషన్లు ఈ క్యాంపులో విజయవంతంగా నిర్వహించామని అన్నారు ఇప్పటి వరకు మూడు వేల ఐదువందల మంది చిన్నారులకు ఆపరేషన్లు చేసి ఎ పి లొనే అత్యధిక పిల్లల గుండె సర్జరీలు చేసిన ఘనత సాధించామన్నారు.

డాక్టర్ రమణ దన్నపనేని మాట్లాడుతూ ఆంధ్ర హాస్పిటల్ లో గత ఎనిమిది సంవత్సరాలుగా ఉచిత పిల్లల గుండె ఆపరేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నారని తాను స్వయంగా నాలుగు క్యాంపుల్లో పాల్గొని చిన్నారులకు సర్జరీలు చేయడం జరిగిందన్నారు కొంతకాలం తరువాత విదేశీ వైద్య బృందంతో అనే లేకుండా ఆంధ్ర హాస్పిటల్ టీమే క్లిష్ట ఏమైనా గుండె ఆపరేషన్లు నిర్వహించే దిశగా పయనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డా.శ్రీమన్నారాయణ, డా.విక్రమ్, డా.కృష్ణ ప్రసాద్, డా.రమేష్, డా.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *